BRS రెండు MP సీట్లు గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి సవాల్

by Disha Web Desk 19 |
BRS రెండు MP సీట్లు గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి సవాల్
X

దిశ, నలగొండ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రెండు ఎంపీ సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో జరిగిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దమ్ముంటే తన సవాళ్లు స్వీకరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని.. ఇక కారు షెడ్డుకేనని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయకుండా నల్గొండ జిల్లాకు వస్తున్న కేసీఆర్ సిగ్గు ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ పార్లమెంట్‌లో మనకు పోటీ ఎవరు లేరని, ఇప్పటికే గెలుపు ఖాయం అయిందని మెజార్టీ కోసమే మనం అంతా పని చేయాలని సూచించారు.



Next Story

Most Viewed