‘కవితకు బెయిల్ దొరకదు.. కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ఉపయోగం ఉండదు’

by Disha Web Desk 9 |
‘కవితకు బెయిల్ దొరకదు.. కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ఉపయోగం ఉండదు’
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కవితకు బెయిల్ దొరకదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పైగా త్వరలో తండ్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్‌ కూడా జైలుకు వెళ్లడం ఖాయమని వెల్లడించారు. కేసీఆర్ మోకాళ్లతో యాత్ర చేసినా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు రావని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఘోర పరాజయం తప్పదన్నారు. ఆ ఆవేదనతోనే పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌కు కాలం చెల్లిందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందని తెలిపారు. బీజేపీకి మూడు సీట్లు వస్తాయని, బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని గొంతెత్తి చెప్పారు.



Next Story

Most Viewed