హుజురాబాద్‌లోనే దిక్కు లేదు.. ఇంకా గజ్వేల్‌లో పోటీనా: ఈటలపై మంత్రి హరీష్ రావు ఫైర్

by Satheesh |
హుజురాబాద్‌లోనే దిక్కు లేదు.. ఇంకా గజ్వేల్‌లో పోటీనా: ఈటలపై మంత్రి హరీష్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. శుక్రవారం మంత్రి హరీష్ రావు హుజురాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ తరుఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గానికి బీజేపీ ఏం చేసిందో ఈటల చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల ఢిల్లీ నుండి లీడర్స్‌ను పట్టుకువస్తున్నారు, పెద్ద పెద్ద లీడర్స్ వస్తున్నారు కానీ రాష్ట్రానికి ఏమైనా తీసుకువస్తున్నారా అని నిలదీశారు. ఈటల గెలిచి గాలికి తిరుగుతున్నారని, ఆయనను నమ్మి ఓట్లేస్తే హుజురాబాద్ ప్రజలను పూర్తిగా మర్చిపోయాడని మండిపడ్డారు.

ఈటల నీకు హుజురాబాద్‌లోనే దిక్కు లేదు.. ఇంకా గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తావా అని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అన్నం తినాలనిపించలేదని అన్నాడు, అలాంటి వ్యక్తితో బీజేపీ పొత్తు పెట్టుకుందని ఫైర్ అయ్యారు. ఈటల రాజేందర్ సమైక్యవాదులతో కలిసిపోయారని విమర్శలు గుప్పించారు. పదవుల కోసం ఇప్పుడు ఈటల ఆత్మగౌరవం ఎక్కడి పోయిందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పాడి కౌశిక్‌ను గెలిపిస్తే.. హుజురాబాద్‌ను మరో సిద్దిపేట చేస్తానని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed