అసెంబ్లీ సమావేశాలపై అక్బరుద్దీన్ ఒవైసీ అసంతృప్తి

by Disha Web Desk 2 |
అసెంబ్లీ సమావేశాలపై అక్బరుద్దీన్ ఒవైసీ అసంతృప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. బడ్జెట్ సమావేశాలు కేవలం 7 రోజులే నిర్వహించడంపై ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ వాయిదా పడే ముందు సమావేశాలు కనీసం 20 రోజులు నిర్వహిస్తే బాగుండేదనని అన్నారు. అలా చేసి ఉంటే కనీసం 25 అంశాలపై స్వల్పకాలిక చర్చ చేసే అవకాశం ఉండేదని ఒవైసీ అభిప్రాయపడ్డారు.

మరోవైపు, కోవిడ్ కారణంగా గతేడాది అసెంబ్లీ సమావేశాలు కుదించారని, ఈసారి కూడా తక్కువ రోజులే నిర్వహించడం సరికాదన్నారు. 2014-18 మధ్య 126 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే, 2018 నుంచి ఇప్పటి వరకు 67 రోజులు మాత్రమే సభ కొలువుదీరిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం క్రియాశీలంగా ఉండాలంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed