గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా చేస్తా: మర్రి రాజశేఖర్ రెడ్డి

by Disha Web Desk 11 |
గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా చేస్తా: మర్రి రాజశేఖర్ రెడ్డి
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: కంటోన్మెంట్ నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు లేకుండా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానని కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంయచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఇంచార్జ్ గా కేసీఆర్ నియమించిన అనంతరం ఆయన సోమవారం బోయిన్ పల్లి సౌజన్యకాలనీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను, ఉద్యమకారులను క్యాడర్ ను సమయాత్తం చేసి ముందుకు సాగుతామని అన్నారు.

కంటోన్మెంట్ నియోజకవర్గంలో కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పాలన నడుస్తుందని స్థానిక నామినేటెడ్ సభ్యుడు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన వందల కోట్ల బకాయిలు అలాగే ఉన్నాయని జీతాలు లేక కంటోన్మెంట్ లో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారైందని అన్నారు. అనేక అంశాలపై ఇప్పటికే తమ పోరాటాలు చేస్తున్నామని ఇకపై పార్టీ పిలుపుమేరకు రానున్న రోజుల్లో అన్ని కార్యక్రమాలను ఏకతాటిపై ఉంటూ నిర్వహిస్తామని అన్నారు. ఎవరికైనా ఇబ్బందులు కలిగితే తనతో డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడొచ్చన్నారు. అందరం కలిసి కట్టుగా ముందుకెళ్లి సాయన్న ఆశయాలను సాధిద్దాం అన్నారు.

ఇప్పటికైనా కంటోన్మెంట్ లో గ్రూప్ రాజకీయాలకు శుభం కార్డు పడనుందా? లేదో? వేచి చూడాలి. ఈ కార్యక్రమంలో తెలంగాణ బెవేరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్, హెల్త్ మెడికల్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతుళ్లు లాస్య నందిత, నివేదిత, కంటోన్మెంట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు టీ.ఎన్ శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, ప్రవీణ్ యాదవ్, బోర్డ్ మాజీ సభ్యులు జక్కుల, పాండు యాదవ్, లోక్ నాథం, నళిని కిరణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed