మేడ్చల్ జాతీయ రహదారి పై వాహనాల తనిఖీలు..

by Disha Web Desk 20 |
మేడ్చల్ జాతీయ రహదారి పై వాహనాల తనిఖీలు..
X

దిశ, మేడ్చల్ టౌన్ : ప్రమాదాలు జరిగినప్పుడు లారీలకు గాని, ఇతర వాహనాలకు గాని అదనపు ఫిటింగ్ ఉండి వాహనం నెంబర్ ప్లేట్లు గుర్తించలేకపోతున్నామని మేడ్చల్ ట్రాఫిక్ సీఐ నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ జాతీయ రహదారి పై లారీలను ఇతర వాహనాలను తనిఖీలు చేసి నంబర్ ప్లేట్ కు అడ్డంగా ఉన్న ఎక్స్ట్రా ఫిటింగ్ను గ్యాస్ వెల్డింగ్ సహాయంతో తమ సిబ్బందితో కలిసి తొలగించారు.

వాహనానికి నెంబర్ ప్లేట్ కనపడకపోవడం ద్వారా ఎన్నో నష్టాలు జరిగే అవకాశం ఉందని సీఐ నర్సింహ రెడ్డి తెలిపారు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ కనిపించకుండా చేసినట్లయితే వాహన యజమాని పై మోటర్ వెహికల్ యాక్ట్ 179(2) రూ. 2,000 వరకు జరిమానా లేదా నెల రోజుల జైల్ శిక్ష పడే అవకాశం ఉందని ట్రాఫిక్ సీఐ తెలిపారు. వాహనదారులు రోడ్ ఎక్కేముందు తమ వాహనానికి ముందు వెనుక నెంబర్ ప్లేట్ సరిగ్గా ఉంచుకొని రోడ్డు ఎక్కాలని ట్రాఫిక్ సీఐ నరసింహారెడ్డి సూచించారు.



Next Story

Most Viewed