బీఆర్​ఎస్​ నాయకులకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి : వడ్డెపల్లి రాజేశ్వర్​రావు

by Sumithra |
బీఆర్​ఎస్​ నాయకులకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి : వడ్డెపల్లి రాజేశ్వర్​రావు
X

దిశ, కూకట్​పల్లి : తెలంగాణలో బీఆర్​ఎస్​కు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డెపల్లి రాజేశ్వర్​రావు అన్నారు. ఓల్డ్​ బోయిన్​పల్లి డివిజన్​లో కొనసాగుతున్న బీజేపీ భరోసా యాత్రలో భాగంగా గురువారం రాత్రి హరిజన బస్తీలో బస్తీ నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించి రాత్రి కాలనీలో బస చేశారు. అనంతరం శుక్రవారం కాలనీలో ఇంటింటి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డెపల్లి రాజేశ్వర్​ రావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నన్ని రోజులు దేశంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరని అన్నారు.

బలహీన వర్గాల సంక్షేమానికి మోడీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. డివిజన్​లో భరోసా యాత్రను అడ్డుకునేందుకు బీఆర్​ఎస్​ నాయకులు కొంత మంది ప్రయత్నించడం, ప్రజలు తిరగబడటం చూస్తుంటే బీఆర్​ఎస్​ నాయకుల పై ప్రజలకు ఉన్న వ్యతిరేకత, బీఆర్​ఎస్​ నాయకులకు వారి ఓటమి భయం ఎంతగా ఉందో ఇట్టే అర్థం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, బీజేపీ జిల్లా కార్యదర్శి వెంకట్ కాంత్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతి యాదవ్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు కర్క డాకయ్య, అసెంబ్లీ కో ఆర్డినేటర్ రవికుమార్ గౌడ్, ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed