డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో మంత్రి మల్లారెడ్డి కి నిరసన సెగ

by Disha Web Desk 11 |
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో మంత్రి మల్లారెడ్డి కి నిరసన సెగ
X

దిశ, దమ్మాయిగూడ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ లో మంత్రి మల్లారెడ్డి కి నిరసన సెగ తగిలింది. శనివారం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహ కల్ప కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండగా.. మంత్రి మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్, బీజేపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్థానికులకే కేటాయించాలంటూ మంత్రి మల్లారెడ్డిని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి అధ్వర్యంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి అక్రమాలను ప్రశ్నించడానికి వచ్చిన నాయకులను అరెస్ట్ చేయడం దౌర్జన్యమన్నారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిచారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ... 9 సంవత్సరాల పాటు చెదలు పట్టిన ఇల్లు ఇప్పుడు కేవలం ఎన్నికల కోసమే 4600 ఇళ్లకు కాను, తూ.. తూ మంత్రంగా 1500 వందల ఇండ్లు పంపిణి చేస్తూ స్థానికంగా అర్హులైన వారికి కాకుండా, ఇతర నియోజక వర్గ ప్రజలకి కేటాయించడం దురదృష్టకరమన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు మోర నాగమల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఈగ శ్వేత, మేడ్చల్ రురల్ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు బాలనర్సింహ గౌడ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, యువమోర్చ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్, ఓబీసీ అధ్యక్షులు ఆంజనేయులు, మహిళా మోర్చ ప్రధాన కార్యదర్శి శోభా, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Next Story

Most Viewed