ఫోన్ ట్యాపింగ్ కేసు దేశ ద్రోహమే.. మాజీ డీజీపీ,సీనియర్ ఐపీఎస్‌ల అభిప్రాయం

by Disha Web Desk 23 |
ఫోన్ ట్యాపింగ్ కేసు దేశ ద్రోహమే.. మాజీ డీజీపీ,సీనియర్ ఐపీఎస్‌ల అభిప్రాయం
X

దిశ, క్రైమ్ బ్యూరో : ఛీ.. ఛీ మన పరువు తీశారు.. మొత్తం పోలీసు ఇజ్జత్ తీసేసారు.. ఇది వింటుంటే చాలా బాధగా ఉంది. ఇలా మాజీ డీజీపీ లు, సీనియర్ పోలీసు అధికారులు వారు వాట్సాప్ గ్రూప్ లలో తాజాగా జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాట్లాడుకుంటూ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ తో మహిళ ల ను బ్లాక్ మెయిల్ చేసి లొంగ దీసుకోవడం క్షమించరానినేరమంటున్నారు. అదే విధంగా పవిత్రమైన బాధ్యత లో ఉన్న అధికారుల ఇలా చేయడం దారుణమన్నారు.

ఈ నేరానికి పాల్పడిన వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి

కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఇజ్రాయెల్ ఇంకా ఇతర దేశాల నుంచి ఈ ట్యాపింగ్ పరికరాలను తీసుకురావడం దేశ ద్రోహం కిందకు వస్తుందని మాజీ డీజీపీ లు, సీనియర్ ఐపిఎస్ అధికారులు స్పష్టం చేశారు. దీనితో పాటు ఈ ట్యాపింగ్ వ్యవహారం జరిగిన కాలం లో డీజీపీ గా పని చేసిన అధికారిని కూడా బాధ్యులుగా చేయాలని వారు తెలిపారు. అతని పర్యవేక్షణ సరిగా లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం తో నే ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ విభాగం లో ఈ ట్యాంపింగ్ జరిగిందని మాజీ డీజీపీ లు చెబుతున్నారు. కేసు నీరు కారకుండా ఉండాలంటే ----ఈ ట్యాపింగ్ కేసు మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే దర్యాప్తును ఎన్ఐఏ, సిబిఐ కి అప్ప చేయాలంటున్నారు. లేదంటే డ్రగ్స్ కేసు, నయీమ్ కేసు ల మాదిరిగా మరుగున పడతాయాన్ని అంటున్నారు.


Next Story