అబద్దాలతో పబ్బం గడుపుకునే వాడు బండి సంజయ్​ : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

by Disha Web Desk 20 |
అబద్దాలతో పబ్బం గడుపుకునే వాడు బండి సంజయ్​ : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
X

దిశ, కూకట్​పల్లి : అబద్దాలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పబ్బం గడుపుకుంటున్నాడని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కాదు అబద్దాల సంజయ్​ అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురావడానికి చేతకాని నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడుగా, ఎంపీగా ఉన్నాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో లేదా, కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. మున్సిపల్​ కార్యాలయంలో గురువారం బీజేపీ నాయకులు డబుల్​ బెడ్​ రూం ఇండ్ల కోసం దీక్ష కూర్చోవడం హాస్యాస్పదమని అన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్​కు లేఖ రాస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గం పరిధిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐడీపీఎల్​ సంస్థకు సంబంధించి ఉన్న 9 వందల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి కెటాయిస్తే అందులో డబుల్​ బెడ్​ రూం ఇండ్లు కట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఐడీపీఎల్​ సంస్థకు 60 ఏండ్ల క్రింద కూకట్​పల్లి నియోజకవర్గంలోని 9 వందల ఎకరాల ప్రైవేటు పట్టా భూములను సేకరించి ఐడీపీఎల్​ కంపెని పెట్టేందుకు కెటాయించారని, కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలతో కంపెనీ నడపలేక మూసివేశారని అన్నారు. 20 ఏండ్ల క్రితం కంపెని మూసి వేశారని ఖాళీగా ఉన్న కంపెనికి కేటాయించిన భూమిని తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్​ చేశారు. తెలంగాణలో అభివృద్ధి జరగలేదని అబద్దాలు చెప్పుకునే బండి సంజయ్​ విలేఖరుల సమక్షంలో బహిరంగ చర్యకు సిద్ధమా అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ డబుల్​ బెడ్​ రూం ఇండ్లు కంట్టించిన దానిలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని చెప్పిన మాట వాస్తవమా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నులలో సగభాగం కూడా తిరిగి రాష్ట్రానికి చెల్లించడం లేదని ఆరోపించారు. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం నుంచి జీహెచ్​ఎంసీకి స్మార్ట్​ సిటి పేరుమీద ఏడాదికి 5 వందల కోట్లు రావాలని కాని దాదాపు 5 ఏండ్లుగా ఇంత వరకు ఒక్క రూపాయి రాలేదని, రాష్ట్రానికి కేంద్రం 2500 కోట్ల రూపాయల నిధులు బాకి ఉందనడం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం డబుల్​ బెడ్​ రూం ఇండ్లు ఇస్తుంటే కరీంనగర్​లో ఎంత మందికి డబుల్​ బెడ్​ రూం ఇండ్లు ఇచ్చావో చెప్పాలి బండి సంజయ్​ అంటు ఘాటుగా విమర్శించారు. అబద్దపు మాటలతో ప్రజలను మోసం చేయడం తప్ప రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీ చేసింది శూన్యం అని బండి సంజయ్​ తెలుసుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్​కు ఇంగ్లీష్​ మాట్లాడటం రాదు అని ఆరోపిస్తున్న నీకు కేటీఆర్​కు భాష వస్తుందో లేదో సమాధానం కూడా రాష్ట్ర ప్రజలే చెబుతారని అన్నారు.

Next Story