AP News:అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తాం:కూటమి అభ్యర్థి

by Disha Web Desk 18 |
AP News:అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తాం:కూటమి అభ్యర్థి
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వం కోర్టుల ద్వారా మొట్టికాయలు తినడంలో రికార్డులు సృష్టించిందని కూటమి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలకు కొంతవరకు అయినా ప్రశాంతంగా ఉన్నారంటే న్యాయవాదులే కారణమని కోనియాడారు. విశాఖ కూటమి ఉత్తరం, దక్షిణం నియోజకవర్గాల అభ్యర్ధులు విష్ణుకుమార్ రాజు,వంశీక్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి బార్ అసోషియోషన్‌లో న్యాయవాదులను కలిసి వారి మద్దతు కోరారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ఉన్న ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా న్యాయ వ్యవస్థ ప్రమేయం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా న్యాయవాదులు కోర్టుల ద్వారా రాష్ట్ర భవిష్యత్తును కాపాడటానికి చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. ఉత్తరం నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ వల్లే ఈరోజు రఘురామక్రిష్ణం రాజు ఉన్నారన్నారు. తన నియోజకవర్గంలో న్యాయవాదులు ఎక్కువగా నివాసం ఉండటంతో తాను నాటి సీఎం చంద్రబాబు సహాయంతో బార్ అసోషియోషన్‌కు కమ్యూనిటి భవనం నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు వివరించారు. ఈకార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవరా సత్యనారాయణ, మాజీ అధ్యక్షులు నాదెండ్ల సుమన్, టీడీపీ విశాఖ అధ్యక్షుడు గండి బాబ్జీ, సీనియర్ న్యాయవాదులతో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed