చర్యలు ఉన్నట్లా.. లేనట్లా..?.. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారుల ఉదాసీన వైఖరి

by Disha Web Desk 23 |
చర్యలు ఉన్నట్లా.. లేనట్లా..?.. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారుల ఉదాసీన వైఖరి
X

దిశ,దుండిగల్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట ఆర్కే టౌన్షిప్ కు అనుకోని జరుగుతున్న అక్రమనిర్మాణాలపై వరుస కథనాలతో మేలుకున్న మున్సిపల్ అధికారులు గురువారం పరిశీలించి అవి అక్రమనిర్మాణాలే అని గుర్తించినట్లు సమాచారం. అక్రమ నిర్మాణాలని తెలినా చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు. కాలం చెల్లిన గ్రామ పంచాయతీ అనుమతులతో గ్రామస్తులను అడ్డం పెట్టుకొని ఓ నిర్మాణ సంస్థ ఇప్పటికే 6 విల్లాలు నిర్మించగా,సుమారు 500 గజాలలో బహుళ అంతస్తుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు,అంతటితో ఆగని సదరు నిర్మాణదారులు ఎటువంటి అనుమతులు లేకుండా 300 గజాల లో మరో నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు.

గత ప్రభుత్వ హయాంలో మొదలైన అక్రమ నిర్మాణాలు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగుతున్నాయి. మున్సిపల్ ఏర్పడినప్పటి నుంచి పూర్తి స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారి లేకపోవడం టౌన్ ప్లానింగ్ సెక్షన్ చైన్ మెన్ చెప్పిందే వేదం. చేసిందే చట్టం అన్నట్లుగా అక్రమ నిర్మాణాలు సాగాయి. బౌరంపేట లోని ఆర్కే టౌన్షిప్ కి ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 264 లోని కొంత భాగాన్ని జాతీయ పార్టీకి చెందిన ఓ నాయకుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సర్వే నెంబర్ 264/పార్ట్ గా మార్చి కంజర్వేషన్ జోన్ నుండి రెసిడెన్షియల్ జోన్ గా మార్చినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

అడ్డదారిలో ల్యాండ్ కన్వర్షన్ ..?

కంజర్వేషన్ జోన్ కి సంబంచిన భూములను రెసిడెన్షియల్ జోన్ కు మార్చాలంటే 5 గురు మంత్రులతో కూడిన క్యాబినెట్ ఆమోదం ఉండాలి. అందులో ఎకరాలలో ఉండాలి బౌరంపేట లోని సర్వే నెంబర్ 264 లో గల 4 ఎకరాల నిషేదిత భూమిని గతంలో ఓ జాతీయ పార్టీకి చెందిన నాయకుడు సర్వే నెంబర్ 264/పార్ట్ గా మార్చిన అధికారులను మ్యారేజ్ చేసి కొంత భూమిని కంజర్వేషన్ నుండి రెసిడెన్షియల్ మార్చి ఇతరులకు గజాలలో అమ్మినట్లు సమాచారం. ఇంత తతంగం జరిగినట్లు తెలిసిన అధికారులు చర్యలకు వెనకడువేయడం పలు అనుమానాలకు తావిస్తుంది.

నోటీసులు సరే..కూల్చివేతల ఎప్పుడు..

కంజర్వేషన్ జోన్ లో అక్రమనిర్మాణాలంటూ దిశ దిన పత్రికలో వరుస కథనాలు వెలువడడంతో మేలుకున్న మున్సిపల్ అధికారులు గురువారం టీపీఓ సంజున టౌన్ ప్లానింగ్ సిబ్బందితో నిర్మాణాలను పరిశీలించారు.టీపీఓ ను దిశ ప్రతినిధి వివరణ కోరగా నిర్మాణాలను పరిశీలించామన్నారు. సర్వే నెంబర్ 264/పార్ట్ లో జరుగుతున్నాయన్నారు. రికార్డుల ప్రకారం పక్కన ఉన్న భూమి కంజర్వేషన్ జోన్ లో ఉందన్నారు.సర్వే నెంబర్ 264/పార్ట్ భూమి రెసిడెన్షియల్ పరిధిలో ఉన్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ అనుమతులతో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.నోటీసులు జారీ చేశామని త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. కూల్చివేతలు జరిగేనా.. నోటీసులతో సరిపెడతారా అన్నదే తెలియాల్సి ఉంది.


Next Story