నగదు జప్తు ' రికార్డు ' కు పోలీసుల్లో పోటీ.. మద్యం దుకాణాల యజమానులే టార్గేట్..?

by Disha Web Desk 12 |
నగదు జప్తు  రికార్డు  కు పోలీసుల్లో పోటీ.. మద్యం దుకాణాల యజమానులే టార్గేట్..?
X

దిశ, రాచకొండ: ఎన్నికల కోడ్ నేపథ్యంలో వైన్స్ షాప్‌ల వద్ద పోలీసులు ప్రత్యేకంగా మాటు వేసి చేస్తున్న తనిఖీలతో పరేషాన్ చేస్తున్నారని వైన్స్ వ్యాపారాలు గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు అనుసరిస్తున్న తీరుతో వైన్స్ వ్యాపారాలు, బార్ యజమానులు తీవ్ర కలవరానికి గురవుతున్నారు. ఈ తరహా వాతావరణం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొందని వైన్స్ అసోసియేషన్ సభ్యులు అంటున్నారు. మరీ మఫ్టిలో మాటు వేసి వైన్స్‌ షాప్, బార్ షాప్‌లు మూసి నగదుతో వెళ్తుండంగా కొద్ది దూరంలోనే పట్టుకుని నగదును సీజ్ చేస్తున్నారని మద్యం షాపు యజమానులు వాపోతున్నారు. వాటిని తిరిగి పొందాలంటే వారం రోజులు పడుతుందంటున్నారు. దీంతో తమ వ్యాపారానికి పోలీసుల తీరు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని వ్యాపారులు విమర్శిస్తున్నారు. నగదుకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్న డోంట్ కేర్ అంటున్న పోలీసుల ప్రవర్తనతో మద్యం వ్యాపారులు కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు.

వినియోగ దారులు డబ్బులు ఇచ్చి మందు ఇవ్వమంటే ఇస్తాము తప్ప వారు కార్యకర్తల, ఓటర్‌లకు పంచుతున్నారా అనే విషయం మాకేం సంబంధం అని వ్యాపారాలు ప్రశ్నిస్తున్నారు. పోలీసు "రికార్డు " సీజింగ్‌ల తాపత్రయం కోసం మా డబ్బులు ఇరుకుపోతున్న వైనం కష్టాలు తెచ్చిపెడుతుందని వ్యాపారాలు ఆరోపిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం వ్యాపారులు ఈ విషయాన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో వైన్ షాప్ వారికి ఎక్సయిజ్ శాఖ అధికారులు ఒక పాసును జారీ చేస్తున్నారు. ఈ పాస్ వైన్ షాప్ మూసిన తర్వాత డబ్బుతో పాటు డిఎస్ఆర్ ( డైలీ సేల్స్ రిపోర్ట్ ) ను వెంట పెట్టుకుని ఉండాలన్నారు. పోలీసుల తనిఖీల సమయంలో దానిని చూపించాలన్నారు. ఉదయం సమయంలో బ్యాంకుకు వెళ్లి నగదు డిపాజిట్ చేసే వరకు పని చేస్తుందని అధికారులు వ్యాపారులకు స్పష్టం చేశారు. ఈ పాస్‌ను ఇతర సమయంలో వాడితే తమకు సంబంధం లేదని ఎక్స్ సైజ్ అధికారులు తేల్చి చెప్పినట్లు మద్యం వ్యాపారులు చెబుతున్నారు.



Next Story

Most Viewed