దిశ కథనానికి స్పందన.... గాజులరామారంలో భారీగా కూల్చివేతలు

by Dishanational1 |
దిశ కథనానికి స్పందన.... గాజులరామారంలో భారీగా కూల్చివేతలు
X

దిశ, కుత్బుల్లాపూర్: దిశ కథనానికి అధికారులు స్పందించారు. కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు... ఫిర్యాదులు చేసినా స్పందన కరువు అనే కథనంతో ఈనెల 21న గాజులరామారంలో జరుగుతున్న పలు సర్వే నెంబర్ లలో జరుగుతున్న భూ కబ్జాలను వివరిస్తూ దిశ ప్రచురించిన విషయం తెలిసిందే. మేడ్చల్ జిల్లా కలెక్టర్, మల్కాజ్ గిరి ఆర్డీఓ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. సర్వే నెంబర్లు 329/1 సాబీర్ నగర్ లో 3 రూములు, 3 బెస్మెంట్స్, 342 అబేద్ బస్తీలో 11 రూములు, 15 బెస్మెంట్స్ పినాకిని క్రషర్ లో 7 రూములు, 2 కాంపౌండ్ వాల్స్, దేవేందర్ నగర్ ఎస్ టీ భవన్ సమీపంలో 3 రూములు, 4 బెస్మెంట్స్, సర్వే నెంబర్ 307 గాలిపోచమ్మ బస్తీలో 4 రూములు, 15 బెస్మెంట్స్ కూల్చివేశారు. కుత్బుల్లాపూర్ మండలం ఆర్ఐ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది తెల్లవారుజామున గాజులరామారంలో మెరుపు దాడులు చేసి ప్రభుత్వ స్థలాలలో వెలసిన అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు.

అనంతరం ఆర్ఐ పరమేశ్వర్ రెడ్డి దిశతో మాట్లాడుతూ.... ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నవారు ఎంతటివారు అయినప్పటికీ వదలబోమని కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కూల్చివేతలతో అక్రమ నిర్మాణాలు ఆగకపోతే కేసులు నమోదు చేసి ప్రభుత్వ స్థలాలను కాపాడుతామని తెలిపారు. ప్రభుత్వ చర్యలు ఖాతరు చేయని వ్యక్తులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయడానికి సైతం వెనుకాడమని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed