కుత్బుల్లాపూర్ లో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ..

by Disha Web Desk 11 |
కుత్బుల్లాపూర్ లో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ..
X

దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధ్యక్షతన జరిగిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ (ప్లీనరీ సమావేశం) ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా బీఆర్ఎస్ ఇంచార్జి, ఎమ్మెల్సీ డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మొదటగా గడిచిన 9 ఏళ్లలో రూ.6 వేల కోట్లతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 'ఫోటో గ్యాలరీ'ని వారు వీక్షించారు. అనంతరం గులాబీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. సభలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. తీర్మానాల ప్రకటన కుత్బుల్లాపూర్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకలో 12 తీర్మానాలను ప్రవేశపెట్టారు. ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీల అధ్యక్షులు, నాయకులు ప్రవేశ పెట్టిన తీర్మానాలను బలపరిచారు.

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలే బీఆర్ఎస్ కు ఊపిరి అని, కార్యకర్తలు లేకపోతే పార్టీయే లేదని అన్నారు. సేవా భావం, క్రమశిక్షణ, క్రియాశీలకంగా పని చేసే 60 లక్షల సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ బీఆర్‌ఎస్సే అని అన్నారు. సీఎం కేసీఆర్ ఎదుర్కొనే దమ్ము, ధైర్యం దేశంలో ఏ పార్టీనేతకు లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు, తప్పుడు ఆరోపణలతో పబ్బం గడపడమే ప్రతిపక్షాల పని అన్నారు. నేడు ఏ రంగాన్ని తీసుకున్నా దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందంటే అది సీఎం కేసీఆర్ గొప్పతనమేనని అన్నారు. ప్రశ్నిస్తే ఈడీ, ఐటి, సీబీఐ దాడులు చేస్తూ బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు.

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని, సీఎం కేసీఆర్ వెంటే నడుస్తున్నారని అన్నారు. ఎన్నికలవేళ మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టెందుకు వచ్చే విపక్షాలకు చెంపపెట్టు సమాధానం చెప్పాలని అన్నారు. సోషల్ మీడియాలో చేసే అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టి వాస్తవాలను ముందుంచాలన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గడిచిన తొమ్మిదేళ్లలో 6 వేల కోట్లతో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు వివరించి.. రాబోయే రోజుల్లో మూడవసారి గులాబీ జెండా ఎగిరేలా బీఆర్ఎస్ శ్రేణులు సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మేయర్, కొంపల్లి చైర్మన్, వైస్ చైర్మన్లు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, నిజాంపేట్ కార్పొరేటర్లు, పాక్స్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed