హిందువులపై దాడి హేయమైన చర్య: ఎంపీ బండి సంజయ్

by Disha Web Desk 23 |
హిందువులపై దాడి హేయమైన చర్య: ఎంపీ బండి సంజయ్
X

దిశ,మేడిపల్లి: మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్, చెంగిచర్ల పిట్టల బస్తిలో హిందువులపై ఓ వర్గం చేసిన దాడి అమానుషమని బండి సంజయ్ కుమార్ అన్నారు. బాదితులను పరామర్శించడానికి చెంగిచర్లకు చేరుకున్న సంజయ్ కుమార్‌ని పోలీసులు అడ్డుకున్నారు. కొద్ది సమయం పాలీసులకు కార్యకర్తల మధ్య తోపులాట జరుగగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. దీంతో బీజేపీ నేతలు బారికేడ్లను తోసుకుని వెళ్లారు. బాధితుల వద్దకు బండి సంజయ్ నాయకులు కార్యకర్తలు చేరుకుని బాదితులను పరామర్శించి వారి సంఘటన వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోలీ వేడుకలు జరుపుకుంటున్న స్థానికులపై ఓ వర్గం దాడి చేసి గాయపరిస్తే వారి పై కాకుండా గాయపడిన హిందువుల పైన లో అందులోను మహిళలపై కేసులు పెట్టి వారిని పోలీసులు బలవంతంగా పాశవికంగా దూషిస్తూ స్టేషన్‌కు తరలిస్తారా.?. అని ప్రశ్నించారు. ఆ మహిళలో ఓ బాలింత కూడా ఉన్న పోలీసులకు కనికరం రాలేదా?.. పాలు లేక బిడ్డ తల్లడిల్లుతుంటె మీకు కనిపించడం లేదా?.. తప్పుడు కేసులు పెట్టి అమాయకులను జైలు పాలు చేస్తారా?.. వారిని వెంటనే బేషరతుగా విడుదల చేసి, కారణమయిన సీఐ, ఎస్సై ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

హిందువులపై జరుగుతున్న దాడులను ఎవరు అరికట్టడం లేదని హిందువులపై ఓ వర్గం దాడి హేయమైన చర్య అని.. హిందువులను కాపాడేది బీజేపీ మాత్రమే అని ప్రజలు ఒకసారి గమనించాలి ఇలాంటి సంఘటనలో కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు రారని అన్నారు. దాడి చేసి నాలుగు రోజులు గడుస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. పోలీసు పక్షపాతంగా వ్యవహరించడం మంచిది కాదని, ప్రభుత్వం వెంటనే స్పందించి పిట్టల బస్తీ వాసులకు డబుల్ బెడ్ రూమ్ నిర్మించి, వారికి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed