అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించండి: టీడబ్ల్యూజేఎఫ్

by Disha Web Desk 11 |
అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించండి: టీడబ్ల్యూజేఎఫ్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలను కేటాయించాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, మేడ్చల్ జిల్లా ఇంచార్జి ఎస్ కే సలీమా డిమాండ్ చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలో భాగంగా బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్ష కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్ కే సలీమా మాట్లాడుతూ... జర్నలిస్టుల సంక్షేమం కోసం టీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకోబడే మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని, జర్నలిస్ట్ సంక్షేమానికి పాటుపడుతూ న్యాయపరమైన కోరికలను అమలు పరచాలని ఆమె డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గుమ్మడి ప్రసాద్ అన్నారు. ఇటీవల ప్రారంభించిన సచివాలయ కార్యక్రమంలో అంతర్జాతీయ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రాధాన్యత స్థానిక మీడియాకు ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు.

జర్నలిస్టులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ మీడియా రంగంలో రాణిస్తున్నారని, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల డిమాండ్లను నెరవేర్చాలని నేషనల్ కౌన్సిల్ నెంబర్ ఎంపల్లి పద్మా రెడ్డి కోరారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ, శాసనసభ్యులకు వినతి పత్రాలు, జిల్లా కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర కౌన్సిలింగ్ సభ్యులు యావపురం రవి, పటేల్ నరసింహ యాదవులు అన్నారు.

జర్నలిస్టుల పక్షాన నిలబడి పోరాడుతున్న ఏకైక యూనియన్ టీడబ్ల్యూజెఎఫ్ అని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి మండపాక కళ్యాణ చక్రవర్తి తెలిపారు. రిలే నిరాహార దీక్ష చేపట్టిన అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు బెలిదే అశోక్, శివకుమార్, దేవేందర్, విష్ణు మోహన్, ఎన్.శివకుమార్, డేవిడ్ రాజ్, యాట రాజు, వినోద్, సాయిరాజ్, వెంకట్, శ్రీనివాసరావు, నరేష్, రాము, పరుశురాం, నిరంత్, ఉపేందర్, శ్రీను,వినోద్ కుమార్, ముఖేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed