అన్ని విద్యాసంస్థల్లో యోగ శిక్షణ : మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 1 |
అన్ని విద్యాసంస్థల్లో యోగ శిక్షణ : మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో మోగ విద్యాను ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ జడ్జెస్ సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమాన్ని అదివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్రంలోని 26 వైద్య కళాశాలలో విద్యార్థులకు యోగ శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతి రోజూ అర గంట మోగాసనాలు సాధన చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. యోగ శిక్షకులు, న్యాయ మూర్తులు, సంస్థలు, ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృపాకర్, టెక్నికల్ కార్యదర్శి తోట సతీష్, జిల్లా గౌరవాధ్యక్షుడు కే.అంజయ్య, అధ్యక్షుడు తోట అశోక్, ప్రధాన కార్యదర్శి నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, యోగ శిక్షకురాలు సంధ్య, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed