రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : టీ.ఎస్.హెచ్.డీ.సీ చైర్మన్ చింతా ప్రభాకర్

by Disha Web Desk 1 |
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : టీ.ఎస్.హెచ్.డీ.సీ చైర్మన్ చింతా ప్రభాకర్
X

ప్రకృతి వైపరీత్యాల నష్టాల నివారణకు ముందస్తు సాగు : కలెక్టర్ డాక్టర్ శరత్

దిశ, సదాశివపేట : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని టీ.ఎస్.హెచ్.డీ.సీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. శనివారం సదాశివపేట మండలం మద్దికుంట గ్రామం, మునిపల్లి మండలంలోని కలాన్ గ్రామంలో రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, వ్యవసాయ యాంత్రీకరణ, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, నకిలీ విత్తనాలను అరికట్టడం, చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. దీంతో జిల్లాలో మూడు రెట్లు సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి అత్యధికంగా పెరిగిందన్నారు. రైతుల కోసం జిల్లాలో 116 రైతు వేదికలను నిర్మించామని తెలిపారు.

వ్యవసాయంపైనే ఆధారపడిన రైతులకు భరోసానిస్తూ రైతుబంధు పథకం కింద సంవత్సరానికి ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. రైతులు సహజ మరణం పొందినా, వారి కుటుంబాలను తక్షణమే ఆదుకునేందుకు రూ.5 లక్షలను రైతుబంధు పథకం కింద అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతని అందిపుచ్చుకొని భవిష్యత్తులో వ్యవసాయ, అనుబంధ రంగాల్లోనూ రాణించాలని ఆయన సూచించారు.

అదేవిధంగా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ.. ముందస్తు సాగుపై రైతులు చర్చించాలని, వ్యవసాయ విస్తరణ అధికారులుతో సందేహాలను నివృత్తి చేసుకుని లాభదాయకంగా సాగు చేయాలని కలెక్టర్ శరత్ సూచించారు. అనంతరం రైతులు పెద్ద సంఖ్యలో ఎడ్లబండ్లతో భారీ ర్యాలీలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో రెవిన్యూ డివిజనల్ అధికారి రవీందర్ రెడ్డి, సర్పంచ్ అంజుం బేగం, ఏడిఏ, ఏఈవో, క్లస్టర్ పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. మునిపల్లి మండలంలోని కలాన్ గ్రామ రైతు దినోత్సవంలో సర్పంచ్ పార్వతి అశోక్, ఎంపీటీసీ రేణుక వెంకటేష్, లక్ష్మీ నగేష్, సర్పంచ్ లు, మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, రైతులు, రైతు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed