తొక్కుకుంటూ వచ్చాం... టచ్ చేస్తే బట్టలు ఊడదీసి కొడతాం..! : రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

by Disha Web Desk 11 |
తొక్కుకుంటూ వచ్చాం... టచ్ చేస్తే బట్టలు ఊడదీసి కొడతాం..! : రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, మెదక్ ప్రతినిధి : మెతుకు సీమ గడ్డ పై మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ఇ చ్చారు. ఇక్కడి వరకు ఊరికే రాలేదు తొక్కు కుంటు వచ్చాం... మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే బట్టలు ఊడదీసి రోడ్డు పై తరిమేస్తామని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కు మద్దతు కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మెదక్ లోని రాందాస్ చౌరస్తా వద్ద శనివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో అభ్యర్థి నీలం మధు తో పాటు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు.

కాంగ్రెస్ హయంలో ఇందిరా గాంధీ ప్రధానిగా మెదక్ జిల్లాలో బీ హెచ్ ఈ ఎల్, బీ డి ఎల్, అర్దీన్స్ ఫ్యాక్టరీ, ఇక్రిశాట్ లాంటి ఎన్నో పరిశ్రమలను నిర్మించిందన్నారు. గత 25 ఏళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎంపీగా గెలిచి జిల్లాకు తెచ్చిన పరిశ్రమలు ఎన్ని, ఎంత మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించారో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కానీ, మూడు నెలలకే వెనక నుంచి కట్టెలు పెడుతున్నారని ఆరోపించారు.


మోడీ ప్రధానిగా, కేసీఆర్ సీఎం గా జిల్లాకు పైసా ఇవ్వలేదని అన్నారు. కారు తుక్కు పట్టి ఖర్కానాకు పోయిందని, తుక్కు కింద అమ్మాల్సిందే అన్నారు. గజ్వేల్ వద్ద పాత సామాన్లు కొంటామని తిరుగుతున్నారని చెప్పారు. కేసీఆర్ కాంగ్రెస్ ఖాళీ అయిందని అంటున్నాడు… కాంగ్రెస్ ఏమైనా ఫుల్ బాటిల్ అనుకుంటున్నావా.. టచ్ చేసి చూడు మాడి మసైపోతావ్ జాగ్రత్త అని హెచ్చరించారు. నేను జైపాల్, జాన రెడ్డిని కాదు బట్టలు ఊడదీసి ఊరికించి రోడ్డు పై కొడతామని హెచ్చరించారు..

బలహీన వర్గాలు బిడ్డను గెలిపించేందుకు తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులను చూస్తే ఉత్సాహంగా ఉందన్నారు. మెదక్ గడ్డ మీద ఇందిరమ్మ ను గెలిపిస్తే ప్రధాని అయ్యాక పరిశ్రమలు తీసుకువచ్చిందని, గత 25 ఏళ్లుగా బీజేపీ, బీ ఆర్ ఎస్ ఎంపీలు గెలిచి తెచ్చిన పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి ఎంతో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ హయంలో వచ్చిన పరిశ్రమల వల్ల దేశం నలుమూలల నుంచి కార్మికులు,ఉద్యోగులు వచ్చి ఉపాధి పొందుతున్నారన్నారు.


మెదక్ పార్లమెంట్ 1999 నుంచి నేటి వరకు బీఆర్ఎస్ చేతిలో ఉంది, కానీ ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప బీజేపీ బీఆర్ఎస్ లు ఏమీ తేలేరన్నారు. 2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పరిశ్రమలు తెచ్చింద్రా అని ప్రశ్నించారు. మాకు ఓట్లెయండి అని బీజేపీ ,బీఆర్ఎస్ లు అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. దుబ్బాక ను మోడీ ద్వారా ఏమి అభివృద్ధి చేశావో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావ్ చెప్పాలని డిమాండ్ చేశారు.


దుబ్బాక లో ఓడించిన రఘునందన్ రావు మెదక్ లో ఎంపీ అవుతారా, పద్మశాలి ల మీద జీఎస్టీ తెచ్చి బీజేపీ చేనేత పరిశ్రమను దెబ్బతీసిందని ఆరోపించారు. కేంద్రంలో మోడీ పడేండ్లు 20 కోట్ల ఉద్యోగాలు చేస్తామని మోసం చేశారు. రైతులను చంపిన బీజేపీ ని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. నల్లధనాన్ని తెచ్చి పేదల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని వేయలేదని, మోడీ సర్కార్ ను గద్దె దించాలి కోరారు. పేదలకు అండగా నిలిచేది మూడు రంగుల జెండా మాత్రమేనని చెప్పారు. ముదిరాజుల ప్రతిష్ట ను కాపాడుకోవాలని, ముదిరాజ్ బిడ్డ నీలం మధు ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ముదిరాజ్, బిసి లపై ఉందన్నారు.


మల్లన్న సాగర్ ముంపు గ్రామాలను ముంచి వేల కోట్లు సంపాదించిన వ్యక్తి బీఆర్ఎస్ టికెట్ తెచ్చుకున్నాడని, వెంకట్రామిరెడ్డి ఏ ఊరు వ్యక్తి అని మెదక్ ఎంపీ టిక్కెట్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు బువ్వ లేనప్పుడు బువ్వ పెట్టింది మదన్ రెడ్డి కానీ టికెట్ ఇవ్వకుండా రైతులకు చెందిన వేల ఎకరాలు భూమిని దౌర్జన్యంగా లాగేసుకున్న వ్యక్తికి టిక్కెట్ ఇస్తారా అని ప్రశ్నించారు. ఢిల్లీలో మోడీ ని చూశాం.. గల్లీ లో కేడి ని చూశాం, 10 ఏండ్లు బీఆర్ఎస్ ,బీజేపీ కి వేశారు.. నేడు బీసీ బిడ్డకు ఓటేయండి కోరారు. మణులు, మాణిక్యాలు అడగడం లేదు పేదింటి బిసి బిడ్డ నీలం మధు ని గెలిపించాలని కోరారు.

Next Story

Most Viewed