శిక్షల శాతం మరింత పెంచాలి : ఐజీ చంద్రశేఖర్ రెడ్డి

by Disha Web Desk 1 |
శిక్షల శాతం మరింత పెంచాలి : ఐజీ చంద్రశేఖర్ రెడ్డి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: కేసుల్లో శిక్షల శాతం పెరిగినప్పుడే నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీజోన్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో సోమవారం పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలన్నారు.

గ్రామాలు, పట్టణాలలో సీసీ కెమెరాల పనితీరు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గంజాయి, ఐడీ లిక్కర్, డ్రగ్స్, ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్, పేకాట తదితర చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై పటిష్ట నిఘా ఉంచి సమూలంగా నివారించాలని సూచించారు. రాబోయే ఎన్నికల గురించి అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు. వీఐపీ, వీవీఐపీ, వచ్చి వళ్లే సమయాల్లో కూడా అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించవద్దని సూచించారు. మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని సూచించారు. అంతకు ముందు సాయుధ దళాల వార్షిక పునరుచ్ఛరణ డీమొబిలైజేషన్, స్పోర్ట్స్ మీట్స్ ముగింపు కార్యక్రమంలో ఇన్స్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీజోన్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని విజేతలకు సీపీ శ్వేత కలసి బహుమతులు అందజేశారు.

అదేవిధంగా సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శించి, 5 ఎస్ ఇంప్లిమెంటేషన్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్.మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీలు రాంచందర్ రావు, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి, గజ్వేల్ ఏసీపీ రమేష్, ఎస్బీ ఏసీపీ రవీందర్ రాజు, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story