అభ్యర్థుల వ్యయాలను పకడ్బందీగా లెక్కించాలి

by Disha Web Desk 15 |
అభ్యర్థుల వ్యయాలను పకడ్బందీగా లెక్కించాలి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయాలను పకడ్బందీగా లెక్కించాలని మెదక్ పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు సునీల్ కుమార్ రాజ్వన్సీ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో ఎక్సైజ్, ఇన్ కమ్ ట్యాక్స్, ఎన్నికల అసిస్టెంట్ ఎక్స్‌పెండించర్ అబ్జర్వర్ల తో మెదక్ పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు సునీల్ కుమార్ రాజ్వన్సీ సమావేశం నిర్వహించారు. స్టాటిక్ సర్వేలెన్సు, ఎస్ఎస్టీ తదితర నిఘా బృందాల ద్వారా సీజ్ చేసిన అక్రమ నగదు, లిక్కర్ రవాణా వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా అధికారులు కృషి చేయాలన్నారు.

అసిస్టెంట్ ఎక్స్‌పెండించర్ అబ్జర్వర్ ఎస్ఎస్ టీ, ఎఫ్ఎస్ టీ బృందాల పనితీరును పర్యవేక్షించాలన్నారు. వీడియో సర్వేలను టీం ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఎన్నికల ర్యాలీలు, సభలు, సమావేశాల సందర్భంగా ఉపయోగించిన వస్తువులను ఎలక్షన్ కమిషన్ రేట్ చార్ట్ ప్రకారం అభ్యర్థుల ఖాతాలో వ్యయాన్ని నమోదు చేయాలన్నారు. ఎక్స్‌పెండించర్ షాడో రిజిస్టర్ అమలు చేయాలని ఆదేశించారు. మీడియా సెంటర్, ఇంటిగ్రేటెడ్ ఎలక్షన్ మానిటరింగ్ సెల్ పరిశీలించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా,

సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ లను గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు గరిమ అగ్రవాల్, శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మూర్తి, అసిస్టెంట్ ఎక్స్​పెండించర్ అబ్జర్వర్లు, డీపీఆర్ఓ రవికుమార్, సమాచార శాఖ డీఈ తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీ-విజిల్, 1950 కాల్ సెంటర్, ఎఫ్ఎస్ టీ వెహికల్ జీపీఎస్ మానిటరింగ్ సిస్టంలను పరిశీలించారు. అదే విధంగా పొన్నాల వద్ద గల ఎస్ఎస్టీ శిబిరాన్ని ఆయన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనుచౌదరితో కలిసి సందర్శించి రికార్డులను పరిశీలించారు.

Next Story

Most Viewed