కష్టకాలంలో ప్రభాకరన్నకు అండగా నిలవాలి

by Disha Web Desk 22 |
కష్టకాలంలో ప్రభాకరన్నకు అండగా నిలవాలి
X

దిశ, దుబ్బాక: దుబ్బాకకు సేవ చేయడానికి వచ్చిన, ప్రభాకరన్న ఆసుపత్రిలో అత్యవసర చికిత్సలో ఉన్నాడు. కష్ట కాలంలో ప్రభాకర్ రెడ్డికి అండగా నిలిచి దుబ్బాక గడ్డ మీద గులాబీ జెండా ఎగుర వేయాలని రాష్ట్ర మంత్రి హరీష్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దుబ్బాకలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంకు హాజరై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి పూర్తి స్థాయిలో కష్టపడి అండగా నిలవలన్నారు. దుబ్బాక అంటే సీఎం కేసీఆర్ కు, తనకు అమితమైన ప్రేమని, హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల లెక్క దుబ్బాక-సిద్దిపేటలకు ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. ఉప ఎన్నికల్లో ఎం కోల్పోయామో ఇప్పటికే గ్రహించారని, నవంబర్30న కారు గుర్తు ప్రభంజనం ఖాయమన్నారు.

ఎమ్మెల్యే ఒక్క పని చేశాడా..

దుబ్బాక ఉప ఎన్నికల్లో హామీలు గుప్పించి గెలిచిన ఎమ్మెల్యే ఒక్క పని అయినా చేశాడా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి నిరుద్యోగికి భృతి, కార్పోరేట్ పాఠశాల, ఉచిత కార్పోరేట్ ఆసుపత్రి, స్కిల్ డెవలప్ మెంట్, ఔటర్ రింగ్ రోడ్డు, డిగ్రీ కళాశాలలు, నూతన పరిశ్రమలు, పుస్తె మట్టెలు, ఎడ్లు బండి, కల్లాలు వీటిలో ఒక్కటైన అమలు చేశాడా అని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడో ఒక్కసారి మనదగ్గరికి ఓచ్చే కేంద్ర మంత్రులతో మనకు ఏంపని, మీకు అందుబాటులో ఉంటా, అర్ధరాత్రి, అపరాత్రి అయినా మీకు అండగా ఉంటా, సిద్దిపేట తరహాలో దుబ్బాక అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని, ఎన్నికల్లో ఘన విజయం దక్కేలా అందరూ ప్రభాకర్ రెడ్డిలా కథానాయకులై ముందుకు సాగాలని ఆయన తెలిపారు.



Next Story

Most Viewed