ఉదయం 5 గంటలకే మద్యం విక్రయాలు... ప్రభుత్వ నిబంధనలకు తూట్లు

by Dishanational1 |
ఉదయం 5 గంటలకే మద్యం విక్రయాలు... ప్రభుత్వ నిబంధనలకు తూట్లు
X

వైన్స్​ షాపు, బార్ల యాజమానులు ధనార్జనే ధ్యేయంగా అడ్డగోలు అమ్మకాలకు తెరలేపారు. ఉదయం 5 గంటలకే వైన్స్​ షాపులను గుట్టుచప్పుడు కాకుండా తెరిచి తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే విక్రయాలు జరపాలనే ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి యథేచ్ఛగా మద్యాన్ని విక్రయిస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మార్పీ ధర కంటే అధికంగా క్వార్టర్​ పై రూ.40 నుంచి 50 వరకు వసూలు చేస్తున్నట్ల సమాచారం. సంగారెడ్డి మున్సిపల్​, గ్రామాల్లో ఇలాంటి తంతంగం జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఎక్సైజ్, పోలీసు అధికారుల అండదండలతోనే మద్యం వ్యాపారులు నేనే రాజు.. నేనే మంత్రిలా వ్యవహరిస్తూ జోరుగా మద్యం విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని నిబంధనలు పాటించని వైన్స్​, బార్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి మున్సిపల్ పరిధి, గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నది. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు జరగాలని నిబంధనలు ఉండగా పలు వైన్స్ షాపులు ఉదయం 5 గంటలకే గుట్టుచప్పుడు కాకుండా సిట్టింగ్ వైన్స్ ప్రాంతాల్లో యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. కాగా క్వార్టర్ మందుకి రూ. 40 నుంచి రూ. 50 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇంతా జరుగుతున్నా ఆబ్కారీ, పోలీసు అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు.

- ఉదయం 5, రాత్రి 10 తర్వాత అడ్డగోలుగా మద్యం అమ్మకాలు..

మద్యం అమ్మకాల విషయంలో నేనే మంత్రి, నేనే రాజులా వ్యవహరిస్తున్నారు వైన్స్ యజమానులు. నాకేమి ఆబ్కారీ, పోలీసు అధికారులకు మామూళ్లు ఇస్తున్నాం కదా... మా టార్గెట్లు మాకుంటాయని వైన్స్ యజమానులు తెలుపుతున్నట్టు పలువురు తెలిపారు.

- రాత్రి 10 దాటినా అమ్మకాలు మామూలే...

మద్యం అమ్మకాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు జరగాలని ప్రభుత్వం నిబంధనలు అమలు చేసిన విషయం తెలిసిందే. కాని సంగారెడ్డి పట్టణంలోని వైన్స్ లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 5 గంటల నుంచే అక్రమంగా అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. క్వార్టర్ మందు ఎంఆర్పీ రేట్ కంటే రూ. 40 నుంచి రూ.50 ఎక్కువగా అమ్ముతున్నారు. ఈ తతంగం అంతా ఎక్సైజ్, పోలీసు అధికారులు చూస్తున్నా పట్టించుకోకపోవడానికి మామూళ్లు కారణమని పలువురు తెలుపుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఉన్నత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.



Next Story

Most Viewed