ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ ఇలాగేనా: సిబ్బందిపై కలెక్టర్‌ శరత్‌ ఫైర్

by Disha Web Desk 1 |
ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ ఇలాగేనా: సిబ్బందిపై కలెక్టర్‌ శరత్‌ ఫైర్
X

దిశ, అందోల్: ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ ఇలాగే ఉంటుందా.. ఎక్కడి చెత్త అక్కడే ఉంటే ఏలా.. పద్ధతి మార్చుకొకపోతే చర్యలుంటాయంటూ ఏరియా అసుపత్రి సూపరిండెంట్‌ రమేష్, శానిటేషన్‌ కాంట్రాక్టర్‌పై జిల్లా కలెక్టర్‌ శరత్‌ ఫైర్ అయ్యారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాలని లేదంటే కాంట్రాక్టు రద్దు చేస్తామని వారిని హెచ్చరించారు. బుధవారం జోగిపేటలోని ఏరియా అసుపత్రిని ఆయన అకస్మికంగా సందర్శించారు. అసుపత్రిలోని అన్ని వార్డులను కలియ తిరిగారు.

ప్రతిరోజూ ఇన్‌ పేషంట్, ఆవుట్‌ పేషంట్‌ల వివరాలను సూపరిండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. అసుపత్రిలోని రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వెద్య సేవలపై ఆరా తీశారు. ప్రసూతి వార్డులో మమత అనే బాలింతను ప్రసవం నార్మల్‌ అయిందా.. లేక సిజేరియన్ నా.. కేసిఆర్‌ కిట్‌ ఇచ్చారా అని ప్రశ్నించారు. అందుకు ఆమె.. టిఫిన్, భోజనం బాగా ఉన్నాయంటూ కలెక్టర్‌ కు తెలిపింది. ఆమెకు పుట్టిన బాబు ఉమ్మనీరు మింగడంతో సంగారెడ్డి లోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి చికిత్స కోసం పంపామని ఆస్పత్రి సూపరింటెందెంట్‌ రమేష్‌ కలెక్టర్‌కు తెలిపారు. వెంటనే సంగారెడ్డి జీజీహెచ్‌ సూపరిండెంట్‌ అనిల్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి బాబు పరిస్థితిని కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. బాబుకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు. ఆసుపత్రిలో తాగునీటి సమస్య ఉన్నట్లు రోగులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని సూపరిండెంట్‌కు ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో అంబదాస్‌ రాజేశ్వర్, తహశీల్దార్‌ వెంకటేశం, తదితరులు ఉన్నారు.

కంటి వెలుగుపై ఆరా..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు పథకం ఏలా ఉందని కలెక్టర్‌ శరత్‌ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పుల్కల్‌ మండలంలోని గంగోజిపేట్‌లో నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాన్ని ఆయన సందర్శించారు. శిబిరంలో కంటి పరీక్షలు చేసుకుంటున్న మహిళలతో మాట్లాడారు. కంటి వెలుగు శిబిరం ఉన్నట్లు ఎవరు చెప్పారు? కంటి సమస్య ఏంటి? అద్దాలు ఇచ్చారా లేదా అంటూ ఆరా తీశారు. శిబిరంలో ఏర్పాటు చేసిన ఆయా వసతులను పరిశీలించారు. కంటి వెలుగు శిబిరానికి వస్తున్న వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారా? లేదా అని రిజిస్టర్లను పరిశీలించారు.

డబుల్‌ బేడ్‌ రూం ఇళ్ల వద్ద నీటి సమస్యను పరిష్కరించాలి

అందోలు–జోగిపేట మున్సిపాలిటీలో ఇటీవల లబ్ధిదారులకు అందజేసిన డబుల్‌ బేడ్‌ రూమ్‌ ఇళ్ల వద్ద తాగు నీటి సమస్యను పరిష్కరించాలని మిషన్‌ భగీరథ, ఆర్‌ డబ్ల్యూఎఎస్, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈలు, హౌసింగ్‌ అధికారులను జిల్లా కలెక్టర్‌ శరత్‌ అదేశించారు. జోగిపేటలోని ఆర్‌డీవో కార్యాలయంలో ఆయా శాఖాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించి, పలు శాఖాలపై సమీక్షించారు. నీటి సమస్య విషయాన్ని మంత్రి హరీష్‌రావు దృష్టికి లబ్ధిదారులు తీసుకొచ్చారని, వెంటనే ఆ పనులను చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, మిషన్‌ భగీరథ, పబ్లిక్‌ హెల్త్, హౌసింగ్‌ అధికారులు, రెవిన్యూ డివిజనల్‌ అధికారి అంబాదాస్, తహసీల్దార్, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed