ఇరిగేషన్ ఏఈ తీరు పై మండిపడ్డ ప్రజాప్రతినిధులు..

by Disha Web Desk 20 |
ఇరిగేషన్ ఏఈ తీరు పై మండిపడ్డ ప్రజాప్రతినిధులు..
X

దిశ, వెల్దుర్తి : పాలన సౌలభ్యంలో అధికారుల తీరు బాగులేదని ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు శాఖల అధికారులు తమ నివేదికలు చదివి వినిపిస్తుండగా ఒక్కసారిగా సభలోని సభ్యులు అభివృద్ధి, పాలనపరమైన విషయాలలో అధికారుల తీరు బాగోలేదని అన్నారు. ప్రభుత్వం నిరుపేద ఆడబిడ్డలకు వివాహాల ఖర్చులకు ఆదుకోనేందుకు ఇచ్చే కళ్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు అందెందుకు నిబంధన ప్రకారం దరఖాస్తు స్వీకరణకు తహసీల్దార్ మరొక రిజిస్టర్ అధికారి సంతకం అవసరం ఉండగా మండలంలోని వివిధ శాఖలలో పనిచేసే గెజిటెడ్ అధికారులు సంతకాలు పెట్టేందుకు లబ్ధిదారులను నాన ఇబ్బందులు పెడుతున్నారని సభ్యులు ఆరోపించారు.

స్పందించిన ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు అవసరమయ్యే సంతకాలు ఏ శాఖ గెజిటెడ్ అధికారి అయిన సంతకాలు చేయాలని ఇబ్బందులు పెట్టవద్దని సూచించారు ఇరిగేషన్ ఏఈ శాఖ పరమైన విషయాలను సభలో వివరిస్తుండగా స్థానిక ఎంపిటిసి మోహన్ రెడ్డి కల్పించుకొని వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని దేవతల చెరువు కట్టకు కుడి చెరువుతూము మరమ్మతులుకునిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపించార అని ప్రశ్నించారు దీంతో ఏఈ సమాధానం ఇవ్వకపోవడంతో ఎంపీపీ ప్రజా ప్రతినిధులు మండిపడ్డారు శాఖ పరమైన విషయంలో ఏఈ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేయగా తాను ఇరిగేషన్ రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తానని తనకు వర్కులపై అవగాహన లేదని సమాధానం ఇచ్చారు అవగాహన లేకుంటే సెలవు పెట్టుకుని ఇంటి వద్ద ఉండాలని సూచించారు. ప్రస్తుతం కుడి చెరువు దేవతల చెరువు వర్షాలు కురిస్తే కట్టలు తెగిపోయి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఏ ఈ పై అసహనం వ్యక్తం చేశారు.

ఇటీవల కాలంలో వెల్దుర్తి మండలంలో పెద్దపులి, చిరుత పులి సంచరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం మండల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అడవి శాఖ అధికారులు మాత్రం ఈ విషయాల పై ప్రజలకు అవగాహన కల్పించడం లేదని సభ్యులు సభ దృష్టికి తేగా శాఖ డిప్యూ రేంజర్ అధికారి రవికుమార్ మాట్లాడుతూ వెల్దుర్తి మండలం లో పెద్దపులి చిరుతపులులు, జంతువులు ఎమిలేవని ఈ మధ్యకాలంలో అడవి జంతువైన హైనా మూగజీవాలపై దాడి చేసి చంపినట్లు తెలిపారు.ఎవరు భయభ్రాంతులకు గురికా వద్దన్నారు. ఈ కార్యక్రఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ తహసిల్దార్లు నాగవర్ధన్ మాలతి ఎంపీటీసీలు మోహన్ రెడ్డి, బాబు, అడవయ్య, లక్ష్మి సర్పంచులు శంకర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి లక్ష్మి భాగ్యలక్ష్మి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed