Breaking News.... రెండుగా చీలిన బీఆర్ఎస్

by Dishanational1 |
Breaking News.... రెండుగా చీలిన బీఆర్ఎస్
X

కొండాపూర్ మండలంలో అధికార బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలింది. మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంతో ఈ విషయం తేట తెల్లమైంది. సభ తేదీని పదిరోజుల క్రితమే నిర్ణయించారు. కాగా 14న సాయంత్రం మండలపార్టీ నాయకులు 15న సంగారెడ్డి బీఆర్ఎస్ కార్యాలయంలో చేనేత అభివృద్ది సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఉంటుందని మండల నాయకులు, ప్రజాప్రతినిధులకు సమాచారం పంపారు. 15న ఉదయం 11గంటలకు మండల సభ ప్రారంభం కావాల్సి ఉండగా అధికారుల హాజరుకాగా ప్రజాప్రతినిధులు సంగారెడ్డికి వెళ్లారు. దీంతో కోరం లేని కారణంగా సమావేశం ఒంటిగంటకు ప్రారంభమైంది. కేవలం కోరం సభ్యులే పాల్గొని మొక్కుబడిగా సమావేశాన్ని కానిచ్చేశారు. ఈ గ్రూపుల గోల ఇలాగే పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతున్నది.

దిశ, కొండాపూర్: మండల పరిధిలోని అధికార బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలింది. మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంతో ఈ విషయం తేటతెల్లమైంది. సభ తేదీని పదిరోజుల క్రితమే నిర్ణయించారు. కాగా 14న సాయంత్రం మండల పార్టీ నాయకులు 15న సంగారెడ్డి బీఆర్ఎస్ కార్యాలయంలో చేనేత అభివృద్ది సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఉంటుందని మండల నాయకులు, ప్రజాప్రతినిధులకు సమాచారం పంపారు. 15న ఉదయం 11 గంటలకు మండల సభ ప్రారంభం కావాల్సి ఉండగా అధికారుల హాజరుకాగా ప్రజాప్రతినిధులు సంగారెడ్డికి వెళ్లారు. దీంతో కోరంలేని కారణంగా సమావేశం ఒంటిగంటకు ప్రారంభమైంది. కేవలం కోరం సభ్యులే పాల్గొని మొక్కుబడిగా సమావేశాన్ని కానిచ్చేశారు. ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ నాయకులు సంగారెడ్డి బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లిపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. మండల సర్వసభ్య సమావేశం ఉందని తెలిసినప్పటికీ కావాలని అదేరోజు, అదే సమయానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఏర్పాటు చేయడం ఏమిటని పార్టీలో చర్చ జరుగుతున్నది.

మండల పార్టీలో రెండు గ్రూపులుగా ఏర్పడ్డాయని, ఆది నుంచి ఎంపీపీని ఆయన వర్గాన్ని నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ఒక పద్ధతి ప్రకారం పక్కన పెడుతున్నారని ఒక వర్గం నాయకులు అంటున్నారు. గత 15 రోజుల క్రితం ఎంపీపీ, డీసీసీబీ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని జీవించుకోలేకనే మరో వర్గం ఎంపీపీ సమావేశానికి పోటీగానే మరో సమావేశం ఏర్పాటు చేశారని నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేసిన ఉద్యమ నాయకులు పార్టీపై అసంతృప్తితో ఉన్నారని, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే అధిక ప్రధాన్యత ఇస్తున్నారని పార్టీలోని ఒక వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. ఈ గ్రూపుల గోల ఇలాగే పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతున్నది.



Next Story