సిద్దిపేట మెడికల్‌ కాలేజీకి మల్టీ డిసిప్లనరీ రీసెర్చ్‌ యూనిట్‌

by Disha Web Desk 1 |
సిద్దిపేట మెడికల్‌ కాలేజీకి మల్టీ డిసిప్లనరీ రీసెర్చ్‌ యూనిట్‌
X

తొలి విడతగా రూ.2.5 కోట్లు మంజూరు.. హర్షం వ్యక్తం చేసిన వైద్య విద్యార్థులు

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు ‘మల్టీ డిసిప్లనరీ రీసెర్చ్‌ యూనిట్‌' మంజూరైంది. కళాశాలలో పరిశోధన వాతావరణాన్ని పెంపొందించడం, పరిశోధనలను ప్రోత్సహించడమే ధ్యేయంగా మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ‘మల్టీ డిసిప్లనరీ రీసెర్చ్‌ యూనిట్‌ మంజూరు' చేయిచడంతో పాటుగా, తొలివిడతగా రూ.2.5 కోట్లు మంజూరు చేయించినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పరిశోధనలకు ఊతమిచ్చేందుకే యునిట్ ను ఏర్పాటు చేయనున్నారు. వైద్య విద్యార్థుల పాఠాలకే పరిమితం కాకుండా, పరిశోధనలపై ఆసక్తి పెంచడం దీని లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 35 విభాగాలుంటాయి. వాటిలో దేనికి సంబంధించి పరిశోధన ఏదైనా చేయాలనుకుంటే ఈ రిసెర్చ్‌ యూనిట్‌ను ఉపయోగించుకుంటారు. ఇందులో పరిశోధనలకు అవసరమైన అన్ని రకాల అధునాతన యంత్ర పరికరాలుంటాయి. మెడికల్‌ కాలేజీల్లో చేసిన పరిశోధనల ఫలితాలను పబ్లికేషన్స్‌కు పంపుతారు.

వాటిల్లో ప్రచురితమైతే అటు పరిశోధన చేసిన విద్యార్థికి, ఇటు ఆ వైద్య కళాశాలకు పేరు వస్తుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మెడికల్ కళాశాలలో పరిశోధన వాతావరణాన్ని పెంపొందించడం, పరిశోధనలను ప్రోత్సహించడంమే ధ్యేయంగా ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మల్టీ డిసిప్లనరీ రీసెర్చ్ యూనిట్ మంజూరు చేయించిన నేపథ్యంలో వైద్య కళాశాల విద్యార్థులు, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed