ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది గెలుస్తాం.. మంత్రి హరీష్ రావు

by Dishafeatures2 |
ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది గెలుస్తాం.. మంత్రి హరీష్ రావు
X

దిశ, సంగారెడ్డి, బ్యూరో: ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని కాంగ్రెస్ నాయకులు నలుగురు నాలుగు దిక్కులుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని, ఆ పార్టీని మునిగే నావ అని మంత్రి అభివర్ణించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రి హరీష్ రావు, కార్పోరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ కథ ముగిసిందని, జిల్లాలో ఉన్న ఆ పార్టీకి చెందిన నలుగురు నాయకులు తలో దిక్కు వెళ్తారని విమర్శించారు. గెలిచినా.. ఓడినా ప్రజల మధ్య సేవకునిగా పనిచేస్తూ చింతా ప్రభాకర్ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. జనంతో ఉంటూ జనం కోసం పనిచేస్తున్న చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పవర్ ఏమిటో చూపిస్తామన్నారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ ను ప్రత్యేకంగా అభినందించారు.సంగారెడ్డికి వైద్య కళాశాల, నర్సింగ్ కాళాశాల తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ ను ప్రజలు మరచిపోరన్నారు. సంగమేశ్వర - బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా త్వరలోనే సంగారెడ్డికి గోదావరి జల్లాలు అందుతాయని చెప్పారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు చింతా ప్రభాకర్ తో కలిసి పనిచేయడానికి ఇరత పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి వెల్లడించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి బీఆర్ఎస్ కేరాఫ్ అడ్రస్ అన్నారు.


కొండాపూర్ మండలం తొగర్ పల్లి కాంగ్రెస్ నాయకులు, ఎంపీటీసీ గౌరీరెడ్డి సంతోష - సంతోష్ రెడ్డి, లోక్ సత్తా రాష్ట్ర కార్యదర్శి మాధవ్ రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ మాణిక్యం , కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అశోక్ దాదాపుతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. సురారం గ్రామానికి పంచాయతీ వార్డు సభ్యులు గొల్ల నర్సింహులు, రోజా శ్రీనివాస్, ఇస్మాయిల్ ఏర్పుల బందయ్య, నిజాంపూర్ గ్రామానికి చెందిన గూడల సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ, కుమ్మరి నర్సింలు టీజేఆర్ మండల అధ్యక్షులు, బేగం రమేష్ యూత్ అధ్యక్షులు, రాజశేఖర్ రెడ్డి, కౌసర్ మైనార్టీ అధ్యక్షుడు దాదాపు ఇతరులు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి , ఎంపీపీ మనోజ్ రెడ్డి , జడ్పీటీసీ పద్మావతి పాండురంగం, పార్టీ మండల అధ్యక్షుడు మ్యాకం విఠల్, లక్ష్మీ చంద్రయ్య వైస్ ఎంపీపీ, శ్రీకాంత్ రెడ్డి కో ఆపరేట్ సొసైటీ చైర్మన్ , మల్లా గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ , మాదవ రెడ్డి , విఠల్ రెడ్డి , కరుణాకర్ సత్యనారాయణ, రమేష్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు, సలావుద్దీన్ , మన్నే అశోక్, నజీర్ పటేల్, బంటు అంతయ్య, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed