బీజేపీ కార్మిక వ్యతిరేక పార్టీ : Minister Harish Rao

by Disha Web Desk 13 |
బీజేపీ కార్మిక వ్యతిరేక పార్టీ : Minister Harish Rao
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: బీజేపీ కార్మిక వ్యతిరేక పార్టీ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ అనుబంధ కార్మిక విభాగం బీఎంఎస్ నాయకులు మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం టీఆర్‌ఎస్ కేవీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ దేశ సంపదను పారిశ్రామిక వేత్తలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. సిద్దిపేట ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం సకల సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. మిట్టపల్లి ప్రాంతమంతా పారిశ్రామిక వాడగా తయారైందన్నారు. నీటి లభ్యత, విద్యుత్ సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు.

మార్చి నాటికి సిద్ధిపేట కు రైలు వస్తుందన్నారు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణం కోసం ఇటీవల రూ.165 కోట్లు రైల్వే శాఖకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. ఎల్కతుర్తి నుంచి రామాయంపేట-మెదక్ వరకు నేషనల్ హైవే నిర్మాణం జరుగుతుందన్నారు. దీంతో సిద్ధిపేటలో పారిశ్రామిక అభివృద్ధి తో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నయని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు. రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి. రవీందర్ రెడ్డి, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, నాయకులు మచ్చ. వేణుగోపాల్ రెడ్డి, కొండం సంపత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed