సంగారెడ్డి పరువుపోతోందంటూ.. మంత్రి హరీష్ రావు ఆగ్రహం

by Disha Web Desk 1 |
సంగారెడ్డి పరువుపోతోందంటూ.. మంత్రి హరీష్ రావు ఆగ్రహం
X

దిశ, కంది: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనుల పరిశీలన నిమిత్తం ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సోమవారం పర్యటించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి వయా కంది మీదుగా సంగారెడ్డికి వస్తుండగా రోడ్డు పై మోరి నీళ్లు పారుతుండటాన్ని మంత్రి హరీష్ రావు గమనించారు. దీంతో సంగారెడ్డి కలెక్టరేట్లో మొక్కలు నాటుతున్న సందర్భంలో మంత్రి హరీష్ రావు పంచాయతీ అధికారులపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ఆ మురికినీళ్లేంటని, సంగారెడ్డికి పరువు పోతోందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

దీంతో జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ స్పందిస్తూ వేరే పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ మోరీ పారుతోందని సమాధానమిచ్చారు. వెంటనే మంత్రి స్పందిస్తూ మరీ రోడ్డుపైకి మురికి నీళ్లు వదలడమేంటని అధికారులను తిరిగి ప్రశ్నించారు. అప్పటి వరకు కనీసం తాత్కాలింగానైనా మోరీ ఏర్పాటు చేసుకోవాలి కదా అంటూ బదులిచ్చారు. మంత్రి ఆదేశించిన కొన్ని గంటల్లోనే జిల్లా పంచాయతీ సిబ్బంది హుటాహుటిన కంది చౌరస్తా నుంచి హైవే పక్కన జేసీబీతో తాత్కాలిక మోరీని తవ్వించారు.

Next Story

Most Viewed