కరెంట్ బిల్లు చూసి మైండ్ బ్లాకు..!

by Disha Web Desk 1 |
కరెంట్ బిల్లు చూసి మైండ్ బ్లాకు..!
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: విద్యుత్ సిబ్బంది ఇచ్చిన కరెంట్ బిల్లు చూసి బట్టల షాప్ యజమాని కగ్గుతిన్న ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులోని గల బట్టల షాప్ లో గత నెల కరెంట్ మీటర్ కాలిపోవడంతో విద్యుత్ అధికారులు కొత్త మీటర్ అమర్చారు. ఇదిలా ఉండగా మార్చి నెల సంబంధించి విద్యుత్ సిబ్బంది మీటర్ రిడింగ్ తీసి బిల్లు ఇవ్వగా మొత్తం 8,169 యూనిట్ల విద్యుత్ వినియోగానికి గాను రూ.90, 163 బిల్లు వచ్చింది. ఇది చూసి బట్టల షాప్ యజమాని అవాక్కయ్యాడు.

ప్రతి నెలా 150 నుంచి 180 యూనిట్ల విద్యుత్ వినియోగానికి గానూ సుమారు రూ.15 వందల నుంచి రూ.2వేల వరకు విద్యుత్ బిల్లు వచ్చేదని, మార్చి నెలలో ఏకంగా రూ.90 వేల బిల్లు రావడంతో షాప్ యజమాని విద్యుత్ అధికారులను సంప్రదించాడు. టెక్నికల్ ప్రాబ్లమ్ తో సమస్య తెలెత్తిందని సమస్యను పరిష్కరిస్తామని విద్యుత్ అధికారులు వెల్లడించడంతో బట్లల షాప్ యజమాని ఉపిరి పిల్చుకున్నాడు. ఈ విషయమై విద్యుత్ అధికారులను వివరణ కోరగా సాంకేతిక సమస్యతో బిల్లు ఎక్కవగా వచ్చినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. సమస్యను పరిష్కరిస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed