స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీ మారిన నాయకులు

by Disha Web Desk 15 |
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీ మారిన నాయకులు
X

దిశ, నర్సాపూర్ : స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వారంతా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన వారేనని, అటువంటి వారితో తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలిపారు. చాలా తక్కువ మంది పార్టీ మారారని అన్నారు. గ్రామాలలో నాయకులు మాత్రమే పోయారని కార్యకర్తలు అలాగే ఉన్నారని చెప్పారు.

ఎమ్మెల్యే ఎన్నికల కంటే రెట్టింపుతో పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. గ్రామాల్లో ఎండిన పంటలను ఇంతవరకు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జులు కానీ పరిశీలించలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మోసం చేసిందని అన్నారు. కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని తెలిపారు. ప్రభుత్వ నిర్వాహణ లోపం వల్లనే గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, నాయకులు శేఖర్ సత్యం గౌడ్, సురారం నరసింహులు, మహమ్మద్, గోవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.


Next Story