కొమురవెల్లిలో ఘనంగా లష్కర్ వారం బ్రహ్మోత్సవాలు

by Web Desk |
కొమురవెల్లిలో ఘనంగా లష్కర్ వారం బ్రహ్మోత్సవాలు
X

దిశ కొమురవెళ్లి: కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా లష్కర్ వారం. ఆలయం భక్త జన సంద్రంగా మారింది. ఆదివారం 30వేల మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం రాత్రి నుండి కొమురవెల్లికి చేరుకున్న భక్తులు దేవస్థానం వారి సత్రాలలో, ప్రయివేటు అద్దె గదులలో బస చేసి తెల్లవారుజామున స్వామి వారి దర్శనానికి క్యూ లైన్‌లో వెళ్లి దర్శించుకున్నారు. సుమారు మూడు గంటల సమయం పట్టింది. స్వామివారికి మొక్కుల రూపంలో కేషకాండన, అభిషేకం, కల్యాణం, గంగ రేగు చెట్టు వద్ద ముడుపులు, తిరుగుడు కోడె, పట్నాలు, బోనాలు, అర్చనలు తదితర మొక్కులు చెల్లించుకున్నారు.

తెలంగాణ జానపద కళ ఉట్టిపడేలా శివసత్తుల శిగాలు, పోతరాజుల విన్యాసాలు, డమరుగా నాధాలతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగారు. అనంతరం కొండ పైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకొని బోనాలు, ఒడిబియ్యం, పట్టువస్త్రాలు, కల్లుసాకతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ బాలాజీ, చైర్మన్ గిస భిక్షపతి, ఆలయ మండలి సభ్యులు ముత్యం నర్సింలు, బొంగు నాగిరెడ్డి, పోతుగంటి కొమురెల్లి, అమర్నాధ్, పార్శారములు, శ్రీనివాస్ ఆలయ అధికారులు భక్తులకు సేవలందించారు. పోలీసులు హుస్నాబాద్ ACP సతీష్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర పర్యవేక్షించారు.


Next Story