కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో లేదంటే బట్టలుడాదిస్తా : Arvind Dharmapuri

by Disha Web Desk 22 |
కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో లేదంటే బట్టలుడాదిస్తా : Arvind Dharmapuri
X

దిశ, దౌల్తాబాద్: అయ్యా ఫామ్ హౌస్ మాస్టర్, కొడుకు గెస్ట్ హౌస్ మాస్టర్ అని వారికి తెలంగాణ ప్రజలు రెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా వున్నారని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా దౌల్తాబాద్‌లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... యువతకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, రైతులకు రుణమాఫీ లేదు, ఉచిత ఎరువులు లేవు ఐనా బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. దళిత బంధు, బీసీ బంధు బీఆర్‌ఎస్ రాబందుల పాలయ్యిందని, అయ్యా కొడుకులను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుని లుచ్చా అని మాట్లాడిన కేటీఆర్‌కు బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ఏముందో తెలువదని ఎద్దేవా చేసారు.

నిరుద్యోగ బిడ్డలకు నిరుద్యోగ భృతి ఇస్తానని, ఉచిత ఎరువులు ఇస్తానని మోసం చేసిన కేసీఆర్ పెద్ద లుచ్చా అని మండిపడ్డారు. కేటీఆర్ రేపో ఎల్లుండో కోరుట్లకు వస్తవాట నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేదంటే బట్టలు ఉడాదిస్తానని హెచ్చరించారు. కేసీఆర్ బిడ్డ కవితమ్మ లిక్కర్ రాణి అని, నిజాలు మాట్లాడితే నన్ను చెప్పుతో కొడుతానని ప్రగల్బాలు పలుకుతుందని పేర్కొన్నారు. 27 నుంచి గ్రామాలలోకి డబ్బుల సంచులు వస్తాయని, ఓటుకు రూ. 5వేలు పంచడానికి వెనుకాడరని అన్నారు. ఎన్ని డబ్బులు ఇచ్చిన తీసుకోండి కానీ ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయాలని కోరారు. దుబ్బాక ప్రజల గొంతుక అసెంబ్లీలో నినాదిస్తున్న రఘునందన్ రావుని రెండవ సారి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో 6 సంవత్సరాలు, కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేక యువత ఒక తరం నాశనమై పోయిందని ఆ పాపం కేసీఆర్ దేనని అన్నారు.


గల్లీగల్లికి బెల్ట్ షాపులు పక్కనే పర్మిషన్ రూంలు పెట్టి తెలంగాణ యువతను కేసీఆర్ మత్తులో ముంచుతున్నారని మండిపడ్డారు. ఉచిత రేషన్, దేశంలో 4 కోట్ల ఇండ్లు కట్టి మహిళల పేరు మీద ఇచ్చిన ఘనత మోడీకే దక్కుతుందని పేర్కొన్నారు. పంట బీమా రావాలన్న, ఉచిత ఆరోగ్య బీమా కావాలన్న బీజేపీ కి ఓటు వేయాలని కోరారు. బీజేపీ గెలిస్తే 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, బెల్ట్ షాపులు బంద్ చేపిస్తాం అని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరుతో రైతుల పొట్ట గోడుతున్నారని పేర్కొన్నారు.

10 ఏండ్ల పాలనలో ఏం చేసారో చెప్పాలి..

బీఆర్‌ఎస్ అధికారంలో వున్నా 10 యేండ్ల కాలంలో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి ఏం చేసారో చెప్పాలని, ఇన్ని రోజులు చేయని వాళ్ళు ఇప్పుడు గెలిపిస్తే అభివృద్ధి చేస్తారని గ్యారెంటీ ఎందని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఒక కొత్త గ్రామ పంచాయతీ భవనం కట్ట చేతకాని దద్దమ్మలు, ఒక కూరగాయల మార్కెట్ కట్టలేని దద్దమ్మలు ఎన్నికలు రాగానే పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రెండున్నర యేండ్లుగా ఏం చేసావని అడిగే వారు దౌల్తాబాద్ నుంచి చేగుంట వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయించానని తెలిపారు. ఇక్కడ రోడ్డు ఉందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి తెలియదని ఎద్దేవా చేసారు. అధికారంలో వున్నా ఏడు ఏండ్లలో 100 ఇళ్ళు కూడా పంచడం చేతకానీ సన్నాసులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దుబ్బాక ప్రజలు గొంతుకగా పనిచేస్తున్న తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. బీఆర్‌ఎస్ మంత్రులు, నాయకుల తిట్లే దీవెనలుగా ముందుకు సాగుతున్ననని వారిలా బజారు బాష మాట్లాడి సంస్కార హినున్ని కాదలచుకోలేదని పేర్కొన్నారు.

Next Story

Most Viewed