'ఏం అభివృద్ధి చేశావని ఊర్లోకి వచ్చావు'.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ..

by Disha Web Desk 13 |
ఏం అభివృద్ధి చేశావని ఊర్లోకి వచ్చావు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ..
X

దిశ, చేర్యాల: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి నిరసన సెగ తగిలింది. మండలంలోని కడవేర్గు గ్రామానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ని గ్రామస్తులు అడ్డుకున్నారు. మా గ్రామానికి 'ఏం చేశావని ఊర్లోకి వచ్చావు' అంటూ.. గో బ్యాక్.. గో బ్యాక్ ముత్తిరెడ్డి అంటూ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే ని నిలదీశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులకు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.


వర్షం కాలం వస్తే.. కడవేర్గు, పెద్ద రాజుపేట గ్రామాల మధ్యన రాకపోకలకు ఇబ్బంది కలగడం వల్ల పలుమార్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నప్పటికీ నిర్మాణాలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నీటి సమస్య తో పాటు పలు సమస్యలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ, అభివృద్ధి కార్యక్రమాల పేరు ముసుగులో గ్రామానికి వచ్చాడంటూ గ్రామస్థులు మండిపడ్డారు. గ్రామంలో సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గ్రామానికి వచ్చే నైతిక హక్కు లేదని హెచ్చరించారు. దీంతో గ్రామ ప్రజలకు సమాధానం ఇవ్వకుండా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వెళ్ళిపోయారు.

Read more:

రాబోయే కురుక్షేత్రంలో మీరు కొట్టుకుపోవడం ఖాయం: పొంగులేటి సంచలన వ్యాఖ్యలు



Next Story

Most Viewed