తెలంగాణ ఇచ్చిన దేవత సోనియమ్మ : జగ్గారెడ్డి

by Disha Web Desk |
తెలంగాణ ఇచ్చిన దేవత సోనియమ్మ : జగ్గారెడ్డి
X

దిశ, పటాన్ చెరు : తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధన కలను నిజం చేసి, తెలంగాణ ఇచ్చిన దేవత సోనియమ్మ అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గురువారం రామచంద్రపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో "విజయభేరి" సభ సన్నాహక సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి హాజరై నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ తో పాటు ముఖ్యనాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఈ నెల 17న తుక్కుగూడలో జరగబోయే విజయభేరీ సభకు జనసమికరణతో పాటు సభ విజయవంతం కోసం చర్చించారు.

ఈ సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ తుక్కుగూడ సభకు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియమ్మ మీటింగ్‌కు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లక్షలాదిగా హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉందని ఈ ప్రాంతం నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చి సభ సక్సెస్‌లో పాలుపంచుకోవలని కోరారు.

పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పటాన్ చెరు నియోజకవర్గాన్ని కేంద్ర సంస్థలు తీసుకొచ్చి అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఆనాడు ఇందిరమ్మ కృషితో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు పారిశ్రామిక రంగం మన ప్రాంతంలో అభివృద్ధి చెందిందన్నారు. దానికి తోడు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ ముఖ్య అతిథిగా హాజరవుతున్న విజయభేరీ సభకు నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వెళ్లి సభను విజయవంతం చేస్తామన్నారు. విజయభేరి సభకు జన సమీకరణ కోసం తెల్లాపూర్ కాంగ్రెస్ నాయకుడు అరుణ్ గౌడ్ తన వంతుగా ఒక లక్ష విరాళం ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కో ఆర్డినేటర్ శ్యామ్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సపాన దేవ్, పీసీసీ మెంబెర్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మండల ప్రెసిడెంట్లు సుధాకర్ గౌడ్, వడ్డె క్రిష్ణ, పుట్ట నర్సింగ్, టౌన్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, మున్సిపాలిటీ ప్రెసిడెంట్స్ శశిధర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, సి ప్రభాకర్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్స్ ఈశ్వర్ సింగ్, శ్రీనివాస్, స్టేట్ ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ నరసింహ, సంగారెడ్డి జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ హబీబ్ జానీ, సంగారెడ్డి జిల్లా ఓ బి సి సెల్ ప్రెసిడెంట్ మావీన్ గౌడ్, సంగారెడ్డి జిల్లా ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ యాదగిరి, అసెంబ్లీ ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ మహేష్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ అధ్యక్షులు, కె ఎస్ జి యువసేన సభ్యులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed