రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు..

by Disha Web Desk 20 |
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితుడికి గుర్తుతెలియని సైబర్ నేరగాడు 10 రోజుల నుండి వీడియో కాల్ చేశాడు. తదుపరి మీరు మాట్లాడిన మాటలన్నీ రికార్డు చేసినానని సోషల్ మీడియాలో పెడతానని బాధితుని బెదిరించగా బాధితుడు భయపడి సైబర్ నేరగాడు చెప్పిన విధంగా అతను చెప్పిన ఫోన్ నెంబర్ కు రూ. 21,500 పంపించాడు. తదుపరి ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో బాధితుడు జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితుడికి గుర్తుతెలియని సైబర్ నేరగాడు ఫోన్ చేసి మి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రివార్డ్ పాయింట్స్ గడువు ముగుస్తున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి అని ఒక లింకు పంపించాడు.

అది నమ్మిన బాధితుడు ఓటీపీ నెంబర్ బ్యాంకు వివరాలు నమోదు చేయగానే బాధితుడు అకౌంట్లో నుండి రూ. 14,441 డెబిట్ అయ్యాయి. అదే విధంగా గుర్తుతెలియని సైబర్ నేరగాడు ఫోన్ చేసి పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయని ఒక యూట్యూబ్ లింకు పంపించగా అది నమ్మిన బాధితుడు జాబ్ లో జాయిన్ అవుతానని మెసేజ్ పంపించాడు. సైబర్ నేరగాడు ఒక టెలిగ్రామ్ గ్రూప్ పంపించగానే అందులో బాధితుడు జాయిన్ అయ్యాడు. తదుపరి అన్ లైన్ సంస్థలలో పెట్టుబడి పెడితే డబ్బులు తక్కువ రోజులలో ఎక్కువ డబ్బులు వస్తాయని సైబర్ నేరగాడు చెప్పగానే అది నమ్మిన బాధితుడు రూ. 13 వేలు పంపించాడు. తదుపరి ఆ టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేయగానే బ్లాక్ అయి ఉంది. ఈ ఘటనలలో బాధితులు జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.



Next Story

Most Viewed