కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రాన్ని నాశనం చేసే కుట్ర : ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

by Disha Web Desk 1 |
కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రాన్ని నాశనం చేసే కుట్ర : ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
X

దిశ, మెదక్ ప్రతినిధి: కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని గోల్ బంగ్లాలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా ఆమె మాట్లాడతూ దళితులు ఆర్థిక స్వాలంబన కోసం దళిత బంధును ప్రభుత్వం ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా బలపరుస్తున్నట్లు ఆమె తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్ ఆలోచన గొప్పదని ఆమె అన్నారు. సీఎం కేసీఆర్ అయ్యాక తెలంగాణ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఉచిత కరెంటు ఎక్కడైనా ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అమిత్ షా తెలంగాణ గురించి తెలుసుకొని మాట్లాడలాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచి పెడుతోందన్నారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇఫ్క్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, రామయంపేట్ మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ అశోక్, లింగారెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గంగాధర్, ఎడుపాయల చైర్మన్ బాలాగౌడ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు, గ్రామ స్థాయి అధ్యక్షులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed