ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

by Disha Web Desk 1 |
ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ
X

దిశ, కొండపాక : ఐటీఐలో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఈ విద్యా సంవత్సరానికి వచ్చే నెల 10 వరకు అవకాశాన్ని కల్పించారు. కావున, పదో తరగతి పాసైన విద్యార్థినీ, విద్యార్థులు వచ్చే నేల 30లోపు ఆన్ లైన్ లో http://iti.telangana.gov.in వెబ్ సైట్లో ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కుకునూర్ పల్లి ఐటీఐ ప్రిన్సిపల్ డి.వెంకటరమణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 8వ తరగతి పూర్తి చేసిన వారికి కొన్ని ట్రేడ్ లలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి అన్ని ట్రేడ్ లలో చేరే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. http://iti.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా మీ దరఖాస్తులను, పూర్తి చేయాలని కోరారు. దరఖాస్తు చేసుకునే సమయంలోనే, మీ ధ్రువ పత్రలను కూడా అందులోనే ఉంచుకోవాలని తెలిపారు. (ఒరిజినల్ మాత్రమే) ఆన్ లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా మీ మార్కులను బట్టి మరియు సామాజిక వర్గాలను బట్టి మీరు ఎంచుకున్న ట్రేడ్/ ఐటీఐకి అర్హులైతే మీకు సీట్ కేటాయింపు జరుగుతుందని, సాధ్యమైనంత త్వరగా ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


Next Story