పాఠశాలకు వెళ్లిన బాలుడు కిడ్నాప్

by Disha Web Desk 11 |
పాఠశాలకు వెళ్లిన బాలుడు కిడ్నాప్
X

దిశ, ములుగు : బడికి వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన మూడు గంటల లోనే బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఘటన మర్కుక్ మండలం కరకపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. శనివారం మర్కుక్ మండల ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… బీహార్ కు చెందిన తంబ్రిజ్ అలాం కరకపట్ల గ్రామంలోని అస్పిరో ఫార్మాలో గత 8 సంవత్సరాల నుండి పని చేస్తున్నారు. తన భార్య ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటున్నాడు.

అయితే తన పెద్ద కొడుకు తవీద్ అలం (7)అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం పాఠశాలకు వెళ్లాడు. పాఠశాల నుండి కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో తోటి స్నేహితులను అడుగగా గుర్తు తెలియని వ్యక్తి తవీద్ అలంకు చెప్పులు ఇస్తానని తన వెంట తీసుకొని వెళ్ళాడని చెప్పారు. వెంటనే తావిద్ తండ్రి తంబ్రిజ్ అలాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఎస్సై మధుకర్ రెడ్డి గ్రామానికి చేరుకొని చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా తవీద్ అలంను భుజంపై చేయి వేసుకొని నడిపించుకుంటూ తీసుకువెళ్లాడని గుర్తించారు.

అనంతరం పిల్లవాడి తండ్రి కి కొత్త నంబర్ నుండి పోను రాగా మీ అబ్బాయి కిడ్నాప్ అయ్యాడని 15 లక్షలు ఇస్తేనే వినిపిస్తామని డిమాండ్ చేశాడు. మర్కుక్ పోలీస్ స్టేషన్ నుండి ఒక టీం,గజ్వేల్ రూరల్ సిఐ నుండి ఒక టీం గా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి సాంకేతిక ఆధారాలతో కిడ్నాపర్ ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చాకచక్యంగా పట్టుకున్నారు. బాలుని తన తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసును మూడు గంటల్లో ఛేదించిన గజ్వేల్ సిఐ మహేందర్ రెడ్డిని , మర్కుక్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్సై మధుకర్ రెడ్డిని సిద్దిపేట కమిషనర్ అభినందించారు.

Next Story

Most Viewed