అదరగొట్టిన హాఫ్ మారధాన్

by Dishanational2 |
అదరగొట్టిన హాఫ్ మారధాన్
X

దిశ,హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పోలీసు శాఖ, రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హాఫ్ మారధాన్ థర్డ్ ఎడిషన్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ పోటీలను ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీపీ శ్వేత, ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. అనంతరం 10 కిలోమీటర్ల హాఫ్ మారదాన్ లో పాల్గొన్నారు. వైజాగ్ రాజమండ్రి , బెంగళూరు తోపాటు వివిధ జిల్లాల నుండి సుమారు 3 వేలకు పైగా పాల్గొన్న ఈ పోటీలలో యువతీ యువకులతో పాటు పెద్దలు వృద్ధులు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ కు చెందిన 71 సంవత్సరాల వృద్ధుడు నాగభూషణ్ రావు 21 కిలోమీటర్ల హాఫ్ మారదాన్లో పాల్గొని పూర్తిచేసి ఔరా అనిపించాడు.

పురుషుల 21 కిలోమీటర్ల హాఫ్ మారదాన్ లో మొదటి విజేత రమేష్ చంద్ర రెండవ విజేత నల్లమల రమేష్ మూడవ విజేత వేద వ్యాస్, మహిళల 21 కిలోమీటర్ల హాఫ్ మారదాన్ లో మొదటి విజేత నవ్య రెండవ విజేత మహేశ్వరి గా నిలిచారు. విజేతలుగా నిలిచిన వీరికి ప్రధమ, ద్వితీయ ,తృతీయ నగదు పురస్కారం 25000,15000,10000 అందజేశారు. 10 కె పురుషుల విభాగంలో మొదటి విజేత మంచికంటి లింగన్న, రెండవ విజేత అనిల్ రాథోడ్, మూడవ విజేత కాట్రోతు అనిల్, 10 కె మహిళల విభాగంలో మొదటి విజేత ఉమా రెండవ విజేత సమీరా మూడవ విజేత కుమారి గా నిలిచారు. విజేతలుగా నిలిచిన వీరికి ప్రధమ, ద్వితీయ, తృతీయ నగదు పురస్కారం 10000,7000,5000 అందజేశారు.

5 కే రన్ పురుషుల విభాగంలో మొదటి విజేత రఫీ రెండవ విజేత అభిషేక్ మూడవ విజేత అనిల్ , 5కే మహిళల విభాగంలో మొదటి విజేత విశాలాక్షి రెండవ విజేత కళ్యాణి మూడవ విజేత హరిత‌గా నిలిచారు. విజేతలుగా నిలిచిన వీరికి ప్రథమ, ద్వితీయ,తృతీయ నగదు పురస్కారం 7500,5000,2500‌లను, ప్రశంసా పత్రాలను పోలీస్ కమిషనర్ శ్వేత డీసీపీ మహేందర్, ఎమ్మెల్యే సతీష్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత విజేతలకు అందజేశారు. అలాగే పోటీలలో పాల్గొన్న వృద్ధులకు కూడా ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో SB ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి ,మున్సిపల్ వైస్ చైర్మన్ అనిత అక్కన్నపేట జడ్పీటీసీ భూక్యమంగ,సీఐ కిరణ్ ఎస్ఐ మహేష్ అక్కన్నపేట ఎస్సై వివేక్ కోహెడ ఎస్ఐ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, హుస్నాబాద్ రన్నింగ్ అసోసియేషన్ అధ్యక్షులు అమ్మిగల రమేష్ ఉపాధ్యక్షుడు సంపత్ కార్యదర్శి మహేందర్ పిడి సత్యనారాయణ రెడ్డి, వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed