జోరందుకున్న నామినేషన్ల పర్వం

by Disha Web Desk 22 |
జోరందుకున్న నామినేషన్ల పర్వం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట జిల్లాలో ఐదోవ రోజు నామినేషన్ల సందడి కొనసాగింది. జిల్లాలో పలువురు కీలక నేతలు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రధాన పార్టీల్లో టికెట్ ఖరారైన అభ్యర్థులతో పాటుగా ఆశావహులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మంగళవారం సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూజల హరికృష్ణ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా ధర్మాజీపేట ప్రతాప్ రెడ్డి, పిల్లి. సాయికుమార్, పైస. రామకృష్ణ, జక్కుల. సత్యనారాయణ నామేషన్ దాఖలు చేశారు. దుబ్బాక నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.



బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి సలాకం. మాలయ్య, యుగ తులసి పార్టీ అభ్యర్థి అది, వేణుగోపాల్, ప్రజా ఏక్త పార్టీ అభ్యర్థి దుట్టపాల నరేష్ నామినేషన్లు దాఖలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల. జమున, పిపుల్ ప్రోటెక్షన్ పార్టీ అభ్యర్థి సదానందరెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా కరుణాకర్ రెడ్డి, మద్దల నర్సింహులు నామినేషన్ దాఖలు చేశారు. హుస్నాబాద్ నియోజక వర్గంలో ఎవ్వరు నామినేషన్ దాఖలు చేయలేదు. జిల్లాలో సిద్దిపేట నియోజక వర్గంలో 5, దుబ్బాక నియోజక వర్గంలో 4, గజ్వేల్ నియోజక వర్గంలో 6 చొప్పున మొత్తం 15 నామినేషన్లు దాఖలయ్యాయి.


Next Story

Most Viewed