కల్తీ సారా చావులకు డీకే అరుణ కారణం కాదా..? మేడే రాజీవ్ సాగర్

by Disha Web Desk 19 |
కల్తీ సారా చావులకు డీకే అరుణ కారణం కాదా..? మేడే రాజీవ్ సాగర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో కల్తీ మద్యంతో ఎందరో చావులకు కారణమైన బీజేపీ నేత డీకే అరుణ.. నేడు ఎమ్మెల్సీ కవితను విమర్శించడం విడ్డూరంగా ఉందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ కవితపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. డీకే అరుణ, బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన.. ఎన్ని విమర్శలు.. తప్పుడు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ గురించి ఎంపీగా ఉన్నప్పుడు కవిత పార్లమెంట్‌లో ప్రశ్నించారన్నారు.

ఢిల్లీ సాక్షిగా మహిళల గురించి ధర్నా చేస్తే కనీసం బీజేపీ పార్టీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ కోసం మహిళగా డీకే అరుణ పోరాటం చేయాల్సింది పోయి.. మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి గొంతెత్తుతున్న కవితను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ పార్టీకి మహిళలకు రిజర్వేషన్ బిల్లుపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. పోరాటం చేసే వారికి సహకరించకుండా బీజేపీ నేతలు విమర్శలకు దిగుతున్నారని దుయ్యబట్టారు.


Next Story

Most Viewed