ట్రేడింగ్‌ పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ళు!

by Disha Web Desk 14 |
ట్రేడింగ్‌ పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ళు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు ఈ మధ్య రెచ్చిపోతున్నారు. జనాలకు ఈజీగా డబ్బులు సంపాదించ వచ్చని మాయ మటలు చెప్పి లక్షలు కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా చదుకున్న వాళ్లే వీరి చేతుల్లో చిక్కి అగమైపోతున్నారు. ఈ క్రమంలోనే ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ ఇవాళ మీడియాకు తెలిపారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెటట్టించి అధిక రాబడిని పొందుతామని వారు మోసం చేస్తున్నారని తెలిపారు.

హైదరాబాద్‌లోని ఓ భాదిత మహిళ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అధిక లాభాలు ఆశ చూపి ట్రెడింగ్ చేస్తాం.. పెట్టుబడి పెట్టండని ఓ గ్యాంగ్ అమెను కోరింది. దీంతో ఆశ పడిన మహిళ విడుతల వారిగా రూ.3.16 కోట్లు వారికి ఇచ్చింది. చివరకు తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ డబ్బు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్లకు చెందిన వారిని అరెస్టు చేశారు. అయితే గుజరాత్ బ్యాంకు అధికారులు సైతం ఈ కేటుగాళ్లతో కుమ్మకు అయ్యారని పోలీసులు గుర్తించారు.


Next Story