బిగ్ బ్రేకింగ్: మల్కాజిగిరి BRS అభ్యర్థి ఫిక్స్.. బీఫాం ఇచ్చిన సీఎం కేసీఆర్

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: మల్కాజిగిరి BRS అభ్యర్థి ఫిక్స్.. బీఫాం ఇచ్చిన సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు మల్కాజిగిరి నియోజకవర్గానికి తమ పార్టీ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డిని మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా గులాబీ బాస్ ఫైనల్ చేశారు. ఈ మేరకు మర్రి రాజశేఖర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బుధవారం బీఫాం అందించారు. మైనంపల్లి రాజీనామాతో మల్కాజిగిరి అభ్యర్థిగా వివిధ నేతల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. మర్రి రాజశేఖర్ రెడ్డికి కేసీఆర్ ఇవాళ బీ ఫామ్ అందించడంతో స్పస్పెన్స్‌కు తెరపడింది. కాగా, మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి పేరును కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

కానీ మైనంపల్లి తనతో పాటు తన కుమారుడి టికెట్ ఇవ్వాలని కోరాడు. మెదక్ టికెట్ ఆశించాడు. కానీ మైనంపల్లికి టికెట్ ఇచ్చిన కేసీఆర్.. మైనంపల్లి కొడుక్కి టికెట్ నిరాకరించాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన మైనంపల్లి బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. అనంతరం మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ మైనంపల్లికి మల్కాజిగిరి టికెట్, ఆయన కొడుక్కి మెదక్ టికెట్ ఫస్ట్ లిస్ట్‌లోనే ప్రకటించింది. మెదక్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికే బీఆర్ఎస్ ఇచ్చిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed