సూసైడ్ అటెంప్ట్ చేసిన మండల అధ్యక్షుడు.. కాంగ్రెస్ MLA ఇంటి వద్ద హై టెన్షన్!

by Disha Web Desk 4 |
సూసైడ్ అటెంప్ట్ చేసిన మండల అధ్యక్షుడు.. కాంగ్రెస్ MLA ఇంటి వద్ద హై టెన్షన్!
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఇంటి ముందు గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోపాల్ పేట మండలానికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకులను పార్టీలో చేర్చుకునే విషయంపై మండలానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరుపగా.. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో బి ఆర్ ఎస్ నాయకులను పార్టీలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలియడంతో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డ గోపాల్ పేట మండల పార్టీ అధ్యక్షుడు గుంట్రాతి గణేష్ గౌడ్, మరి కొంతమంది ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు. కేసులు పెట్టారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే వాళ్లు పార్టీలోకి వస్తే మా పరిస్థితి ఏంటి..!? వాళ్లను పార్టీలోకి చేర్చుకోవద్దు అంటూ వాదనకు దిగారు. ఈ నేపథ్యంలో గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె తెచ్చి నన్ను అంటి పెట్టండి అంటూ ఎమ్మెల్యే మెగా రెడ్డికి అగ్గిపెట్టె ఇవ్వబోయాడు. పోలీసులు వెంటనే స్పందించి గణేష్ గౌడును దూరం తప్పించి అగ్గిపెట్టె తీసేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. పోలీసులు కలుగజేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Next Story