వరి వేస్తే ఉరే అన్న సన్నాసి కేసీఆర్: షర్మిల ఘాటు విమర్శలు

by Disha Web Desk 19 |
వరి వేస్తే ఉరే అన్న సన్నాసి కేసీఆర్: షర్మిల ఘాటు విమర్శలు
X

దిశ, ఊట్కుర్: వరి వేస్తే ఉరి అని చెప్పిన సన్నాసి ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. పోడు భూములకు పట్టాలు ఇస్తామని మోసం చేశాడని పెద్దపొర్ల గ్రామంలో వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. 60 ఏళ్లలోపు చనిపోతే నే రైతుకు రైతు భీమా ఇస్తామని, ఇన్నేళ్ల లోపే చనిపోవాలని రైతు నుదుటిన మరణ శాసనం కేసీఆర్ రాస్తున్నాడని మండిపడ్డారు. రైతుల ప్రాణాలు అంటే కేసీఆర్‌కు లెక్కే లేదనీ.. ఉద్యోగాలు లేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకునే నాధుడే లేడని అన్నారు.

8 ఏళ్లుగా ఊరించి ఊరించి 17 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు ఇచ్చారని.. రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. యూనివర్సిటీలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని, కావాలని విద్యార్థులను ఫెయిల్ చెయ్యాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నరని ఆరోపించారు. చదివి పాస్ అయితే ఉద్యోగాలు అడుగుతారని కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. రుణమాఫీ సంగతి దేవుడెరుగు, బ్యాంక్‌లలో తెచ్చిన రుణాలకు వడ్డీలు కట్టలేనీ పరిస్థితి రైతులకు ఏర్పడిందని చెప్పారు. కేసీఅర్ దొంగ మాటలు నమ్మొద్దని.. 8 ఏళ్లుగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనుడు కేసీఆర్ విమర్శలు గుప్పించారు.



Next Story

Most Viewed