జూన్ 2 న ఆర్ఓబీని ప్రారంభిస్తాం: మంత్రి ప్రశాంత్ రెడ్డి

by Disha Web Desk 11 |
జూన్ 2 న ఆర్ఓబీని ప్రారంభిస్తాం: మంత్రి ప్రశాంత్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అప్పన్నపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 న ప్రారంభించనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సోమవారం దేవరకద్ర మండల కేంద్రంలోని ఆర్ఓబీని ప్రారంభించడానికి జిల్లా కేంద్రం మీదుగా వెళ్ళుతూ అప్పనపల్లి ఆర్ఓబీ పనులను, పట్టణంలో ఆర్ అండ్ బీ చేపట్టిన రహమానియా బ్రిడ్జి పనులు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి పరిశీలించి మీడియాతో మాట్లాడారు.

అప్పన్నపల్లి మొదటి బ్రిడ్జి 12 సంవత్సరాలలో పూర్తి చేయగా, రెండవ రైల్వే బ్రిడ్జిని 12 నెలల్లోనే పూర్తి చేయించిన ఘనత మంత్రి శ్రీనివాస్ గౌడ్ కే దక్కుతుందని ఆయన ప్రశంసించారు. ఉద్యమ సమయంలో తాను మహబూబ్ నగర్ కు వచ్చినప్పుడు సింగిల్ లైన్ రోడ్డు ఉండేదని, ఎమ్మెల్యే అయ్యాక డబుల్ లైన్ రోడ్డు అయ్యిందని, ఇప్పడు ఫోర్ లైన్ రోడ్డుగా మారిందని, అప్పటికి ఇప్పటికి ఎంతో అభివృద్ధి చెందిందని, ఇది ఆయన కృషికి నిదర్శనమని కొనియాడారు.

సువిశాలమైన ప్రధాన రహదారిపై జంక్షన్లు, పార్కులు, బుద్దవనం, శిల్పారామం, మిని ట్యాంక్ బండ్ లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పట్టుదల ఏంటో అర్థమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి నాయక్, అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మూడా చైర్మన్ గంజి వెంకన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed