జులై నాటికి కరివెన, ఆగస్ట్ నాటికి ఉదండాపూర్ కు నీరు నింపాలి : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 20 |
జులై నాటికి కరివెన, ఆగస్ట్ నాటికి ఉదండాపూర్ కు నీరు నింపాలి : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
X

దిశ, వనపర్తి : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులను వేగవంతం చేయాలని రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ లోని మంత్రుల నివాససముదాయంలో రాష్ట్రవ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని నీటి పారుదల శాఖ సీఈ హమీద్ ఖాన్ మర్యాద పూర్వకంగా కలిసశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతి వివరించారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పనుల సందర్శనకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వస్తున్ననేపథ్యంలో నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

నూతన సచివాలయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల ప్రగతిపై తొలిసమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జులై నాటికి కరివెన, ఆగస్ట్ నాటికి ఉదండాపూర్ కు నీటిని ఎత్తిపోయాలని ఆదేశించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మే6 వ తేదీ ఆయా నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కార్యదర్శి స్మిత సబర్వాల్, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్ నిర్మాణం పనులను పరిశీలించనున్నారన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న డీఈ సత్యనారాయణ గౌడ్ ఉన్నారు.



Next Story

Most Viewed